హోదా ఆగిపోతుంది: పురంధేశ్వరి, 'పవన్ కళ్యాణ్ మిత్రుడే కానీ.. తెలియక'

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడని చెప్పారు. పవన్‌కు ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని బీజేపీ నేత దారా సాంబయ్య అన్నారు.

విజయవాడ: 14వ ఆర్థిక సంఘం ఆదేశానుసారం మార్చి నుంచి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు దానిని నిలుపుదల చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వెల్లడించారు.

ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్రత్యేక ప్యాకేజీతో ఇస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పూర్తిగా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. మార్చి నుంచి అన్ని రాష్ట్రాలకు హోదా నిలిచిపోతుందన్నారు. ఏ రాష్ట్రానికి హోదా ఉండదన్నారు. అటువంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనడం తగదన్నారు.

 Pawan Kalyan is our friend, says BJP leader

ఏపీకి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడే హోదా అని అని బీజేపీ నేత దారా సాంబయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనే ఓ హోదా అయినప్పుడు ఇక ప్రత్యేకమైన హోదా ఎందుకని ప్రశ్నించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాని కంటే అదనంగానే వెంకయ్య సాధించుకొస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడని చెప్పారు. పవన్‌కు ఎవరో తప్పుడు సమాచారం, సలహాలు ఇస్తున్నారన్నారు. అవగాహన లోపంతో వెంకయ్యపై పవన్ కళ్యాణ్ అలా మాట్లాడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+