Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిలిచినా.. షాకిచ్చిన పవన్ కళ్యాణ్, జగన్.. కారణాలివేనా?: వెళ్లొద్దని బాబు పిలుపు

కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. జూన్ 4వ తేదీన ఆదివారం (ఈ రోజు) గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై బహిరంగ సభ నిర్వహిస

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. జూన్ 4వ తేదీన ఆదివారం (ఈ రోజు) గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై బహిరంగ సభ నిర్వహిస్తోంది.

చదవండి: 'ఎన్టీఆర్ ఫ్యామిలీని విడదీయవద్దు, నారా లోకేష్ పైకి నెట్టవద్దు'

ఈ సభకు పవన్ కళ్యాణ్‌ను, జగన్‌ను ఆహ్వానించారు. అయితే, వారి ఆహ్వానానికి ఇరువురు నేతల నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉద్యమిస్తామని, వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే హోదా తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది.

ఈ నేపథ్యంలో జరుగుతున్న బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ రఘువీరా రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను, జగన్‌లను ఆహ్వానించారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

కారణాలివేనా?

కారణాలివేనా?

హేతుబద్ధత లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే ముఖ్య కారణం అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజనను ఇష్టారీతిన చేసిందని పవన్ కళ్యాణ్ కూడా మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇక, జగన్ విభజనను వ్యతిరేకించిన వాడిగా ముద్రపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహనం

కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహనం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహనం అనే వాదనలు ఉన్నాయి. తన సోదరుడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని పవన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఈ కారణంగా ఆయన పార్టీ పెట్టి బిజెపి-టిడిపికి మద్దతు పలికారు. ఓ వైపు హేతుబద్ధత లేని విభజన, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న ఆగ్రహంతో పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఆహ్వానంపై స్పందించలేదని అంటున్నారు.

రాహుల్ సభకు వెళ్లవద్దని చంద్రబాబు పిలుపు

రాహుల్ సభకు వెళ్లవద్దని చంద్రబాబు పిలుపు

విభజన కష్టాలకు కారణమైన కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు వెళ్లవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో శనివారం రాత్రి సభ నిర్వహించారు. విభజనతో ప్రజల పొట్టకొట్టి ఏర్పడిన పుండు మాయకుండానే రాహుల్‌గాంధీ వస్తున్నారని, ఆయన సభకు వెళితే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించిన వారవుతారని, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని, ఆ పార్టీకి సహకరించకూడదని పిలుపునిస్తున్నానని, దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు.

జగన్ మాట మార్చారు

జగన్ మాట మార్చారు

విభజన సమయంలో కాంగ్రెస్‌, వైసిపి నాటకాలాడాయని, ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించి మాటమార్చిందని ఇదో అవకాశవాదమని చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్ నిబద్ధతతో వ్యవహరించిందని, విభజన సమయంలో సక్రమంగా వ్యవహరిస్తే సమస్యలు వచ్చేవి కావని అన్నారు.

అందుకే ప్యాకేజీ

అందుకే ప్యాకేజీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. పరిస్థితులను అనుసరించి కేంద్ర నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక హోదా ప్రకటనకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దానికి తీసిపోని విధంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి కేంద్రం చట్టబద్ధత కల్పించిందని, తదుపరి చర్యలు వేగవంతమయ్యేలా నిరంతరం కేంద్రంతో సంప్రదిస్తున్నామని, పోలవరానికి అడ్డంకులు తొలగి పనులు వేగవంతమయ్యాయని, ఈ నెల ఎనిమిదో తేదీన కాపర్‌డ్యాంకు శంకుస్థాపన జరగనుందని చెప్పారు.

అందుకే కష్టపడుతున్నా

అందుకే కష్టపడుతున్నా

పోలవరాన్ని పూర్తి చేయాలని, రాజధానిని నిర్మించాలని దేవుడు తనను ఆదేశించాడని, తన కుటుంబం కోసం, తన కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నానని చంద్రబాబు అన్నారు. 2013-14లో ఉమ్మడి రాష్ట్రంలో రూ.89.214 తలసరి ఆదాయం ఉండేదని, ప్రస్తుతం రూ.1,22,376గా ఉందని, రాజధానికి రూ.1500 కోట్లు, కృష్ణా, గుంటూరు జిల్లాల మురికినీటి పారుదల వ్యవస్థకు రూ.వేయి కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.1050 కోట్లు, ఆర్థిక లోటు భర్తీకి రూ.3,957 కోట్లు కేంద్రం కేటాయించిందని, ఢిల్లీలోని ఏపీ భవన్‌ను జనాభా ప్రాతిపదికన విభజించాల్సి ఉందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+