Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహానాడు ఎఫెక్ట్: 'ఆ మాటలతో ఎన్టీఆర్ ఫ్యామిలీని విడదీస్తారా'

వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు తమ స్వార్థ రాజకీయం కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని విడదీస్తారా? అని టిడిపి నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు తమ స్వార్థ రాజకీయం కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని విడదీస్తారా? అని టిడిపి నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాకుంటే ఆ పార్టీలకు ఎందుకని ప్రశ్నించారు.

చదవండి: 2019 కోసం జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సూచన, పవన్ కళ్యాణ్‌తో కలిసేనా?

మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబం రాలేదని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, వైసిపి నేతలు కొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న వారిపై శనివారం నిప్పులు చెరిగారు.

విడదీయవద్దు

విడదీయవద్దు

మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాలేదని అంటూ రఘువీరా రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. విపక్షాలు తమ రాజకీయాల కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని విడదీయవద్దని హితవు పలికారు.

అవినీతి గురించి జగన్ మాట్లాడటమా

అవినీతి గురించి జగన్ మాట్లాడటమా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఏం జరిగినా దానిని తెలుగుదేశం మీదకు, చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల మీదకు నెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.

ప్రత్యేక ప్యాకేజీపై..

ప్రత్యేక ప్యాకేజీపై..

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ విపక్షాలు ఆందోళన చేయడంపై బుద్ధా మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం 30సార్లు ఢిల్లీ వెళ్లారని, దానికి సమానమైన ప్యాకేజీ తీసుకు వచ్చారని చెప్పారు. హోదాకు మించి ప్యాకేజీ ఉంటుందని బిజెపి నేతలు చెబుతున్నారని గుర్తు చేశారు.

అనైతిక విభజన

అనైతిక విభజన

మచిలీపట్నంలో నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఎంపి కొనకళ్ల నారాయణ మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అనైతికంగా విభజించిన రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలియనది కాదన్నారు. తీవ్ర లోటు బడ్జెట్‌తో కనీసం రాజధాని లేని పరిస్థితుల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+