తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

21న తిరుపతిలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం.. రాయలసీమ ప్రజాసమస్యల పరిష్కారం కోసం జనసేనాని

|
Google Oneindia TeluguNews

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేరుగా రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాంతంలోనూ ప్రజల వద్దకు నేరుగా వెళుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మూడు సార్లు నిర్వహించిన జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విశేషంగా స్పందన వచ్చింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోమారు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది.

ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జనవాణి

ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జనవాణి


ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనవాణి కార్యక్రమం ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జరగనుందని ఆ పార్టీ వెల్లడించింది. రాయలసీమ ప్రాంతంలో సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 21వ తేదీ, ఆదివారం తిరుపతిలోని జి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం మొదలుకానుందని జనసేన ప్రకటించింది.

రాయలసీమ జిల్లాల ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావచ్చు

రాయలసీమ జిల్లాల ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావచ్చు


ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావచ్చు. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రజలు తమ సమస్యలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావచ్చని జనసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించి పవన్ కళ్యాణ్ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు అని, ఆపై వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆయా శాఖల వారీగా లేఖలు రాస్తారని జనసేన పేర్కొంది.

 మూడు విడతలుగా సాగిన జనవాణికి విశేష స్పందన.. ఇప్పుడు నాలుగో విడత తిరుపతిలో

మూడు విడతలుగా సాగిన జనవాణికి విశేష స్పందన.. ఇప్పుడు నాలుగో విడత తిరుపతిలో


ఇదిలా ఉంటే ఇప్పటికే జనవాణి కార్యక్రమం విజయవాడలో రెండు విడతలు పూర్తి చేసుకోగా, భీమవరంలోనూ కార్యక్రమం ఇటీవల పూర్తయింది. మూడు విడతలుగా నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చి తమ గోడును పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి తాను అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పాటు, ఆయా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు.

మూడు విడతల్లో ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ఆయా శాఖల వారీగా పరిష్కరించేందుకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక యంత్రాంగం కృషి చేస్తోందని జనసేన పార్టీ చెప్తుంది. ఇక ప్రస్తుతం నాలుగో విడత కార్యక్రమంగా తిరుపతిలో జనవాణి జరగనుంది. దీనికి ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉంటుందో తెలియాల్సి ఉంది.

English summary
On 21st august, Pawan Kalyan is organizing Janavani program in Tirupati. The Jana Sena has issued a statement that the people of Rayalaseema districts can give their petitions in the context of directly knowing the problems of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X