• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్న‌య్య కు నాకు అదే తేడా : జ‌గ‌న్ కు బ‌లం ఉంద‌ని న‌మ్మాడు : ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు..!

|

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో అన్న‌య్య చిరంజీవి పై ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అదే విధంగా త‌న‌కు సన్నిహితుడైన ఆలీ త‌న‌ను కాద‌ని వైసిపి లో చేర‌టం పైనా ప‌వ‌న్ స్పందించారు. త‌న‌కు అన్న‌య్య‌కు ఉన్న తేడాను ప‌వ‌న్ వివ‌రించారు.

 అన్న‌య్య‌కు...నాకు స్ప‌ష్ట‌త ఉంది..

అన్న‌య్య‌కు...నాకు స్ప‌ష్ట‌త ఉంది..

జ‌న‌సేన స‌భ‌ల్లో చిరంజీవి గురించి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే స్పందించే ప‌వ‌న్ ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూ లో మాత్రం స్ప ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తుండ‌గా..నాగ‌బాబు న‌ర్సాపు రం ఎంపీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. వీరిద్ద‌రి త‌రపున చిరంజీవి ప్ర‌చారం చేస్తార‌ని మెగా ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విదేశాల‌కు విహార యాత్ర‌కు వెళ్లారు. ఇక‌, ఇదే విష‌యం పై ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం స్ప‌ష్ట‌త ఇచ్చారు. జనసేన పార్టీ తరపున ప్రచారానికి అన్నయ్య వచ్చే అవకాశం లేదన్నారు. ఆయన పొలిటికల్ కన్ క్లూజన్ ఆయన తీసేసుకున్నారని చెప్పుకొచ్చారు. పాలిటిక్స్‌ను నేను చూసే విధానం వేరు.. ఆయన చూసే విధానం వేరు అని విశ్లేషించారు. ఆ విషయంలో త‌మ‌ ఇద్దరి మధ్య స్పష్టత ఉందన్నారు. ఆయన కళాకారుడు.. నేను కళాకా రుడిని కాదు... అంతే తేడా అంటూ పవన్ కల్యాణ్ కొత్త విశ్లేష‌ణ చేసారు.

జ‌గ‌న్ కు బలం ఉంద‌ని న‌మ్మి..

జ‌గ‌న్ కు బలం ఉంద‌ని న‌మ్మి..

ఇక‌, త‌న మిత్రుడు ఆలీ త‌న‌ను కాద‌ని వైసిపి లోకి వెళ్ల‌టం పైనా ప‌వ‌న్ స్పందించారు. ఇక అలీకి అవకాశం ఉందని చెబుతూనే..ఆయ‌న‌ ఎక్కడికైనా వెళ్లొచ్చు అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మి వెళ్లాడని వ్యాఖ్యానిం చారు. చంద్రబాబుకు లేదని అక్కడికి వెళ్లకపోవచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. అది ఆయన ఛాయిస్ అని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసారు. ప‌వ‌న్ తో స‌న్నిహితంగా ఉండే ఆలీ తొలుత జ‌న‌సేన నుండే పోటీ చేస్తార‌ని అంద‌రూ భావించారు. అయితే, అప్ప‌టికే టిడిపిలో ఉండటంతో ఆ పార్టీ నుండి ఎన్నిక‌ల్లో దిగుతార‌ని అంచ‌నా వేసారు. కానీ,చివ‌ర‌కు ఆలీ వైసిపి లో చేరి ఎక్క‌డ నుండి పోటీ చేయటం లేదు. వైసిపికి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం మాత్రం చేస్తున్నారు. ఇక‌, ఆలీ వైసిపి లో చేర‌టం పై ప‌వ‌న్ ఎక్క‌డా నెగిటివ్ గా ఆలోచించ‌టం లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.

 రెండు స్థానాల్లో గెలుస్తానంటూ..

రెండు స్థానాల్లో గెలుస్తానంటూ..

ఒక రాజ‌కీయ పార్టీ అధినేత‌గా రెండు స్థానాల్లో పోటీ చేసే వెసులుబాటు త‌న‌కు ఉంటుంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. త‌న అన్న‌య్య నాగ‌బాబు సైతం ఎంపీగా పోటీ చేస్తున్నారు. నాగ‌బాబు పోటీ చేసే న‌ర్సాపురం లోక్‌స‌భ ప‌రిధిలోకే ప‌వ‌న్ పోటీ చేస్త‌న్న భీమ‌వ‌రం అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. అదే విధంగా సిబిఐ మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన నుండి విశాఖ ఎంపీగా పోటీలో ఉన్నారు. అదే లోక్‌స‌భ ప‌రిధిలోని గాజువాక అసెంబ్లీ నుండి ప‌వ‌న్ రెండో స్థానంగా పోటీ చేస్తు న్నారు. అయితే, ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో గెల‌వటంతో పాటుగా మెజార్టీ ఓట్లు సాధించ‌టం ద్వారా రెండు లోక్‌స‌భ స్థానాల్లో నాగ‌బాబు..ల‌క్ష్మీ నారాయ‌ణ ను గెలిపించే బాధ్య‌త‌ను ప‌వ‌న్ తీసుకున్నారు. జ‌న‌సేన వ‌చ్చే ప్ర‌భుత్వం ఏర్పా టు లో కీల‌క భూమిక పోషిస్తుంద‌ని ప‌వ‌న్ చెబుతున్నారు.

English summary
Pawan Kalyan key comments on Chiranjeevi and Ali. Pawan says Chiranjeevi will not campaign for his party in this elections. Pawan felt jagan more strong than Chandra Babu..by that reason Ali joined in YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X