Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమిత్ షా తో పవన్ కీలక భేటీ - 'మెగా' డెసిషన్..!!

ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గ భేటీ వేళ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్ర మంత్రులతో పవన్ సమావేశం కానున్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం వేళ పవన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి తో భేటీ కీలకంగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం జమిలితో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉంది. అదే విధంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తున్న వేళ అమిత్ షా - పవన్ భేటీ వేళ మెగా డెసిషన్ ఉంటుందనే చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్రం కీలక నిర్ణయాల కు సిద్దం అవుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ సారి బడ్జెట్ లో ఈ రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా ప్రతిపాదన లు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా జమిలి ఎన్నికలు.. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతిపాదించేందుకు రంగం సిద్దమైంది. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటుగా మిత్రపక్షాలకు ఈ విస్తరణలో ప్రాధాన్యత పెరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ కానున్నారు. తన నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టుల పైన చర్చించనున్నారు. ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగే భేటీ రాజకీయం గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కీలక అంశాల పైన చర్చ జరగనుంది.

pawan-kalyan-key-meeting-with-union-home-minister-amith-shah-amid-central-cabinet-expansion

జనసేనకు కీలక బాధ్యతలు

అమిత్ షాతో జరిగే భేటీలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పవన్ కల్యాణ్ చర్చించే అవకాశాలున్నాయి. త్వరలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. బీజేపీకి రెండు, టీడీపీ - జనసేనకు చెరో ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. కాగా.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏపీకి మరో బెర్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ నుంచి బీజేపీ, టీడీపీ కి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం ఉంది. జనసేన మంత్రివర్గంలో చేరలేదు. ఇక.. ఇప్పుడు విస్తరణలో జనసేనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కాగా.. రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటికీ అమలు కాలేదు. ఇదే సమయంలో నాగబాబును కేంద్రానికి పంపుతారనే మరో వాదన జనసేనలో వినిపిస్తోంది. దీంతో.. జనసేనకు రాజ్యసభ పదవి పైన అమిత్ షా భేటీలో పవన్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా ఏపీలో కూటమి బలోపేతం.. భవిష్యత్ కార్యక్రమాల పైనా చర్చించనున్నారు. అటు మంత్రివర్గ సమావేశం వేళ.. ఇటు హస్తినలో పవన్ కల్యాణ్ కీలక భేటీలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+