విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు పవన్ ఛాలెంజ్: తాట తీస్తా-15 సీట్లకే వైసీపీ పరిమితం : మీరా -మేమా తేల్చుకుందాం రండి...రెఢీనా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా బజాయిస్తుంది. వైసీపీ నాయకత్వానికి ఛాలెంజ్. మీరా మేమా తేల్చుకుందాం రండి... మీ తాట తీసీ మోకాలు మీద కూర్చో బెడతాం రండి. ఎవరు జనసేన మీదకు వచ్చినా ఊరుకోము. వీళ్లు ఇప్పటి దాకా మన లాంటి వాళ్లను చూడలేదు. భయపడే ప్రసక్తే లేదు. బీహార్ నుంచి కిరాయి గ్యాంగులను తెచ్చుకోండని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారిపోతాయని...వైసీపీకి 15 సీట్లు మాత్రమే వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. ఇప్పుడు కౌరవ సభ చూపిస్తున్నారు..అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పారు. దమ్ముతో మాట్లాడుతున్నానని...దమ్ముంటే ఆపుకోండి.. యుద్దానికి మీరు పిలిచారు...భవిష్యత్ లో మీకు ఉంటుంది అంటూ హెచ్చరించారు. యుద్దం ఎలా కావాలో ఛాయిస్ మీదేనంటూ సవాల్ చేసారు.

వైసీపీకి మన లాంటి వాళ్లు తగల్లేదు

వైసీపీకి మన లాంటి వాళ్లు తగల్లేదు

వైసీపీకి మనలాంటి వాళ్లు ఇప్పటి దాకా తగళ్లేదని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు చాలా మంది మనవాడికి మద్దతివ్వు అని అడిగారు..కానీ, మనవాడికి గుణం ఉందా లేదా అనేది చూడమని చెప్పానని గుర్తు చేసారు. ఆ వ్యక్తి ఏపీలో విధ్వంసం చేస్తున్నారని..ఆ పాపంలో మీకు భాగం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అంటే రెండు కులాలు కాదు. గెలిపించి చూపించండి. డెవలప్ మెంట్..శాంతి భద్రతల విషయం లో ఎలా ఉంటుందో చూడండి. ఎంగిలి మెతుకులు..మోచేతి అంబలి కోసం ఎగబడతారు. మీరు జాతి కోసం మాట్లాడద్దని వ్యాఖ్యానించారు.

సినీ ఇండస్ట్రీ వాళ్లు అడిగితేనే మాట్లాడాను

సినీ ఇండస్ట్రీ వాళ్లు అడిగితేనే మాట్లాడాను

సినీ ఇండస్ట్రీ వాళ్లు వచ్చి అడిగారు. వాళ్ల కోసమే మాట్లాడాను. ప్రజారాజ్యం విషయంలో పశ్చాత్తాపం కోసమే ఇప్పుడు పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏనుగు ను గుర్తించకపోతే...దాని కాళ్ల కింద నలిగిపోయే రోజు వస్తోంది. వైసీపీ ఛానల్ లో జనసేన గురించి పేరు చెప్పాలంటే అంత చిన్నచూపా. రెండు కులాలే అధికారం చూడాలా. అగ్రకులాలను గౌరవిస్తాను. మిగిలిన కులాలు ఏమవ్వాలి. ఒక్క కులమే శాసిస్తామంటే కుదరదని స్పష్టం చేసారు. అమరావతి లో ఒక వర్గం వారిని తుడిచేసే ప్రయత్నం చేసారని..వారికి జనసేన అండగా ఉంటామని చెప్పారు.

అమరావే రాజధానిగా ఉంటుందంటేనే బీజేపీకి మద్దతు

అమరావే రాజధానిగా ఉంటుందంటేనే బీజేపీకి మద్దతు

వ్యూహాల్లో భాగంగానే పొత్తుల నిర్ణయాలు జరిగాయని చెప్పారు. అమరావతి రాజధానిగా అక్కడే ఉంటుందని బీజేపీ నేతలు హామీ ఇస్తేనే వాళ్లతో కలిసానని స్పష్టం చేసారు. ప్రత్యేక హోదా పైన తాను ఇప్పటికీ నిలబడే ఉన్నానని చెప్పారు. వైజాగ్ లో అయినా గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం నిలబడే వాడిని. వైసీపీకి ఓట్లన్నీ వేసి..నన్ను పని చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. వైసీపీ వర్గ శత్రువుగా ఒక వర్గాన్ని చూసి డెవలప్ మెంట్ విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు.

Recommended Video

Tollywood Producers Meets AP minister Perni Nani
అన్ని కులాలు..వర్గాలకు సముచిత ప్రాధాన్యత

అన్ని కులాలు..వర్గాలకు సముచిత ప్రాధాన్యత

అప్పటి పాలకుల నుంచి ప్రాణ భయం ఉందని రంగా దీక్షకు కూర్చుంటే ఆయన మద్దతు దారులు పక్కన కూర్చొని ఎందుకు కాపాడుకోలేకపోయారనేది తన ప్రశ్నగా చెప్పారు. ప్రజారాజ్యంలో అన్నయ్య కోసం సహాయం గా నిలబడ్డాను. కానీ, నిస్సహాయుడని అయ్యాను. మనం నిలబడలేక పోయామనే ఆవేదన పోలేదు, పాలకులు చేసిన తప్పులకు ప్రజలు తిట్లు తిన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మా ఆడబిడ్డల ఒంటి మీద చేయి వేసారు. అక్రమ కేసులు పెట్టారు. ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారని విమర్శించారు.

English summary
Janasena Chief Pawan Kalyan lamblasts YCP says that he would make them bend on their knees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X