Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొన్ని లోపాలు ఉన్నాయి,ఉదాసీనత వీడండి- పవన్ కీలక వ్యాఖ్యలు..!!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని అప్ర మత్తం చేసారు. ఉదాసీనత వీడాలని... పారదర్శకతతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేసారు. అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పని చేయాలని నిర్దేశించారు.

ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. నాలుగు గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్ధవంతంగా అందాలంటే అంతా సమష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నా మని వివరించారు.

Pawan Kalyan made interesting comments over implementation of Welfare schemes directions for officials

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైనదేనని చెప్పుకొచ్చారు. పెట్టే ఖర్చు, దానివల్ల అందే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడే లా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేయాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన మీద దృష్టిపెట్టామని పవన్ వెల్లడించారు.

లోపాలను అధిగమించాలి

మొదటి విడత పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ.5,700 కోట్లు ఖర్చు చేసినట్లు పవన్ చెప్పుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగు పర్చే కార్యక్రమం 'అడవి తల్లి బాట' పథకం కిం రూ.1005 కోట్లను వెచ్చించామన్నారు. దీంతో పాటు సాస్కీ నిధులు రూ.2,123 వేల కోట్లతో నియోజక వర్గాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తు న్నామని చెప్పారు.

అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో పనులను క్రమపద్ధతిలో చేస్తున్నా మని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కొన్ని ఫిర్యాదులు అందుతున్ నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాల అమలు, పనులు జరుగుతున్న తీరు విషయంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని చెప్పిన పవన్... దీనిని అధిగమించా లని స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+