Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి కేంద్రం హెచ్చరిక: గవర్నర్‌గా సుప్రీం మాజీ జడ్జిని ఎందుకు పంపించారో అర్థమైందా: పవన్

ఏపీ గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అపాయింట్ కావడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కర్మ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలని సూచించారు.

అమరావతి: రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి, పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎస్ ఏ నజీర్ ఏపీ గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. ఆయనతో పాటు మొత్తం 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇవ్వాళ నియమితులయ్యారు. వారి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన అబ్దుల్ నజీర్ ఈ ఏడాది జనవరి 4వ తేదీన పదవీ విరమణ చేశారు.

సుప్రీం నుంచి..

సుప్రీం నుంచి..


జస్టిస్ ఎస్ ఏ నజీర్ స్వరాష్ట్రం కర్ణాటక. 1983లో బార్ కౌన్సిల్ లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. చరిత్రాత్మకమైన బాబ్రీమసీదు-రామజన్మభూ వివాదంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. ఏపీతో మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

కర్మ కాన్సెప్ట్..

కర్మ కాన్సెప్ట్..


జస్టిస్ ఎస్ ఏ నజీర్ ను ఏపీ గవర్నర్ గా పంపించడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి హెచ్చరిక సంకేతాలు అందినట్టేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్డిగా మద్దతు ప్రకటిస్తూ వస్తోన్న బ్యూరోక్రాట్లు ఇప్పటికైనా జాగ్రత్త పడాలని సూచించారు. వైసీపీకి అండగా ఉంటోన్న అధికార యంత్రాంగం కర్మ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవాలని చెప్పారు.

 కర్మ ఈజ్ యూనివర్సల్ లా..

కర్మ ఈజ్ యూనివర్సల్ లా..

కర్మ అనేది యూనివర్సల్ లా అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మీరు ఏది విత్తుతారో.. అదే మొలకెత్తుతుంది.. అనే సూత్రాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వికృత పరిపాలన సాగిస్తోందంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో క్లిప్ ను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

సీరియస్ గా తీసుకోండి..

జస్టిస్ గోపాల్ గౌడ చేసిన వ్యాఖ్యలను అధికారులు సీరియస్‌ గా తీసుకోవాలని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తోన్న ప్రతి ఒక్క బ్యూరోక్రాట్ ను కూడా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఏపీలో అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రైవేటు సైన్యంలో వ్యవహరిస్తోందంటూ గతంలో గోపాల్ గౌడ చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సహజ వనరుల దోపిడీ..

సహజ వనరుల దోపిడీ..

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు తలపెట్టిన ఉద్యమానికి మద్దతుగా ఇదివరకు రాష్ట్రానికి వచ్చారు జస్టిస్ గోపాల్ గౌడ. రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార యంత్రాంగం మొత్తం ప్రైవేట్ ఆర్మీలాగా వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. సహజ వనరులను అధికార పార్టీ దోచుకుంటోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను తిరగనివ్వని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయంటూ ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+