ఓడిపోతానని తెలిసే..: పవన్ షాకింగ్ కామెంట్స్

అమలాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. ఇవ్వాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తన మాటల దాడిని కొనసాగించారు. పొత్తుల అంశాన్నీ ప్రస్తావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్నారాయన.

వైఎస్ఆర్సీపీ నాయకులను ఆయన క్రిమినల్ గ్యాంగ్‌గా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే తాను ఈ క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవపెట్టుకుంటున్నానని అన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కాకినాడ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శల గురించి ప్రస్తావించారు. తాను ద్వారంపూడి కుటుంబానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు.

Pawan Kalyan made key remarks at Varahi Yatra

గతంలో జీఎంసీ బాలయోగి మాత్రమే కోనసీమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టారని, ఆ తరువాత దీని గురించి పట్టించుకున్న నాయకుడు లేడని వ్యాఖ్యానించారు. కోనసీమకు జిల్లాలో ఇప్పటివరకూ ప్రభుత్వ ఆసుపత్రి లేదని గుర్తు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే కాకినాడకు వెళ్లాల్సిన దుస్థితిని జిల్లా ప్రజలు ఎదుర్కొంటోన్నారని పవన్ కల్యాణ్ అన్నారు.

14 సంవత్సరాలుగా తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచానని, అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డానని ఆయన చెప్పారు. అయినప్పటికీ.. ధైర్యంగా నిల్చోవడానికి కారణం- కోనసీమ ప్రాంత ప్రజలేనని పేర్కొన్నారు. వారికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తులను గెలిపించాలని, సినీనటుల అభిమానుల పేరుతో గొడవలు పడొద్దంటూ హితవు పలికారు. మహేష్ బాబు, ప్రభాస్ తనకంటే పెద్ద హీరోలని కితాబిచ్చారు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఎదిగారని ప్రశంసించారు. తనకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ గ్లోబల్ స్టార్స్‌గా మారారని పేర్కొన్నారు.

రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు తనకు, జనసేనకు అండగా నిలవాలంటూ పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. సినిమాల వరకు ఎవరికి నచ్చిన హీరోలను వారు అభిమానించాలని.. రాజకీయాలకు వచ్చేసరికి సమష్ట నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులను పరమర్శించడానికి తాను వస్తే ప్రభుత్వం భయపడి దిగొచ్చిందని, ఆ వెంటనే ధాన్యం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే తడాఖా చూపిస్తానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+