పిడికిలి: ఆగస్టు 15న పవన్ కళ్యాణ్ పార్టీ చిహ్నం?

హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమా షూటింగులు చేస్తూనే తన పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న తన పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు బ్రేక్ వేసేందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

జనసేన పార్టీ గుర్తుగా పవన్ కళ్యాణ్ పిడికిలిని ఎన్నుకున్నట్లు చెబుతున్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు కూడా పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. ఓ వైపు గోపాల గోపాల షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు జిల్లాల వారీగా తాత్యాలిక కమిటీలు ఏర్పాటుకు పవన్ తన అనుచరులతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Pawan Kalyan may launch party symbol on August 15

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేనను విస్తరించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో కూడా తన పార్టీకి అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గోపాల గోపాల షూటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. గబ్బర్ సింగ్ - 2 సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదం ఘటనపై స్పందించారు. ప్రమాద స్థలిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఓ వైపు షూటింగులు చేస్తూనే అవసరమైనప్పుడు బయటకు రావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+