బద్వేలు బీజేపీ అభ్యర్దిగా సురేష్ : టీడీపీ ఓట్ బ్యాంకుపైనే గురి : పవన్ రూటు అటే- ఢిల్లీకి రిపోర్ట్..!!
ముఖ్యమంత్రి సొంత ఇలాకా కడప జిల్లాలోని బద్వేల ఉప ఎన్నికకు బీజేపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి వెంకట సుబ్బయ్య మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో ఉన్నారు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబానికే టిక్కెట్ ఇవ్వటంతో ఏకగ్రీవానికి సహకరించాలని వైసీపీ కోరింది. అప్పటికే టీడీపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. అయితే, బద్వేలు పోటీ పైన బీజేపీ-జనసేన మధ్య చర్చలు జరిగాయి. కానీ, పవన్ ఆకస్మికంగా తన అనంతపురం పర్యటనలో తాము బద్వేలు లో పోటీ చేయటం లేదని ప్రకటించారు.
వైసీపీతో పోరాటం చేస్తున్నా..విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మరణించిన ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ వెల్లడించారు. దీంతో..బీజేపీ షాక్ తింది. అయినా..అధినాయకత్వం సూచన మేరకు బరిలో దిగింది. బద్వేలు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పనతల సురేష్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఏబీవీపీ... యువమోర్చాలో సురేష్ పని చేసారు. అయితే, అక్కడ పార్టీ ప్రచారం- గెలుపు బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..ఆదినారాయణ రెడ్డికి అప్పగించారు.

ఇక, జనసేన నిర్ణయం తరువాత టీడీపీ సైతం తమ వైఖరి మార్చుకుంది. తాము పోటీలో ఉండటం లేదని ప్రకటించింది. దీంతో..ఇప్పుడు బీజేపీ నుంచి ఎన్నికల బాధ్యతలు తీసుకున్న సీఎం రమేష్..ఆదినారాయణ రెడ్డి ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చిన వారు కావటం..టీడీపీ పోటీలో లేకపోవటంతో..ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటుగా టీడీపీ అనుకూల ఓటు సైతం తమకు మళ్లించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్ది గెలుపు బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ అప్పగించారు.
మండలాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మను తిరిగి ఉప ఎన్నికల్లో అభ్యర్దిగా నిలబెట్టారు. అయితే, పవన్ తీసుకున్న నిర్ణయం..టీడీపీతో తిరిగి పవన్ జత కడుతారనే ప్రచారం పైన ఏపీ బీజేపీ నేతలు తమ పార్టీ అధినాయకత్వానికి రిపోర్ట్ పంపినట్లు సమాచారం. పవన ఏకపక్షంగా పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారనేది కమల నాధుల అభిప్రాయం. ఇదే సమయంలో పవన్ ను ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తోంది.

అయితే, పవన్ ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేవని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక, పవన్ తో దూరం పెరుగుతోందనే అభిప్రాయం బీజేపీ నేతల్లోనూ వ్యక్తం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో అనధికారికంగా క్షేత్ర స్థాయిలో జనసేన - టీడీపీ మధ్య పరస్పర అవగాహనతో కొన్నింట గెలుపొందారు. బీజేపీతో పొత్తు కంటే టీడీపీ తోనే మేలు చేస్తుందంటూ జనసేన ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు.
Recommended Video
టీడీపీ నుంచి మాజీ మంత్రులు కొందరు ఇప్పటికే జనసేనతో కలవాలంటూ తమ పార్టీ అధినాయకత్వానికి ఓపెన్ గానే సూచించారు. వీటన్నింటి పైన బీజేపీ నేతలు ఢిల్లీలో తమ అధినాయకత్వానికి వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఈ ఉప ఎన్నిక పూర్తయిన తరువాత రాజకీయంగా సమీకరణాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్ -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..!












Click it and Unblock the Notifications