పవన్ కళ్యాణ్ క్రేజ్: త్వరలో రెండు రాష్ట్రాల్లో జనసేనాని పర్యటన

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్ కళ్యాణ్ పర్యటన : జగన్ కి పోటీనా ?

  హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ యాత్ర ఎక్కడి నుంచి, ఎలా చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఓ వైపు జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. మరోవైపు పవన్ పాదయాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

   పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలిసిందే

  పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలిసిందే

  పాదయాత్ర ద్వారా పవన్‌ జనానికి చేరువ కావాలా లేదా, బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలా అన్నది జనసేనలో ఇప్పుడు చర్చ సాగుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి పాదయాత్ర చేస్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.

  వారి అభిప్రాయంతో పవన్ ఏకీభవించారు

  వారి అభిప్రాయంతో పవన్ ఏకీభవించారు

  గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కోర్ కమిటీ ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేస్తే పరిస్థితులు ఎలా ఉండవచ్చన్న దానిపై పూర్తి వివరాలను అందచేసినట్లుగా తెలుస్తోంది. పవన్‌ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించారట.

   ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఆపాలి

  ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఆపాలి

  పవన్ పాదయాత్ర ద్వారా కాకుండా బస్సు యాత్ర ద్వారానే జనంలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలని ఎక్కడ ఆపాలి అన్న చర్చ సాగుతోంది.

   రెండు తెలుగు రాష్ట్రాలలో

  రెండు తెలుగు రాష్ట్రాలలో

  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ముందుగా ఏపీలో ఆ అనంతరం తెలంగాణలో పర్యటించబోతున్నారని తెలుస్తోంది.

  ఎప్పుడు ఉంటుందో తేలాలి

  ఎప్పుడు ఉంటుందో తేలాలి

  పవన్ కళ్యాణ్ యాత్ర ఎప్పుడు ఉండబోతోందన్న విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. జిల్లాల్లో పార్టీ నేతల ఎంపిక, నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల నియామకం తర్వాతే యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో పవన్ శ్రీకారం చుట్టవచ్చునని తెలుస్తోంది.

  ప్లీనరీ తర్వాత

  ప్లీనరీ తర్వాత

  యాత్ర సహా అనేక అంశాలను చర్చించిన జనసేన కోర్ కమిటీ ప్లీనరీ నిర్వహణపై కూడా దృష్టి సారించింది. లోకసభ స్థానాల్లో సమన్వయ కర్తలను కూడా త్వరలోనే నియమించనుండటంతో పాదయాత్రలో వారి సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan may start Bus tour in next year.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి