వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పవన్ కళ్యాణ్: రాజధాని రైతులతో భేటీ, చంద్రబాబుతో చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ కోరారు. గురువారం మధ్యాహ్నం ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం, కేంద్రం, సహాయసహకారాలు, రైతుల స్థితిగతులపై పవన్ బాబుతో చర్చించనున్నట్లు సమాచారం.

అమరావతి శంకుస్థాపనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేలకపోవడం పట్ల చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు తెలిసింది. రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతులకు గతంలో మద్దతుగా నిలిచిన పవన్, వారి తరపున వకాల్తా పుచ్చుకుని, భూములివ్వడానికి ఎందుకు అయిష్టత చూపుతున్నారో వివరిస్తారని సమాచారం.

Pawan Kalyan-cbn

ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారని తెలిసింది. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ మీడియా సమావేశంలో మాట్లాడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గురువారం ఉదయం పదిన్నర గంటలకు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఆ తర్వాత ఉదయం 11 గంటలకు రాజధాని ప్రాంత రైతులతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకుంటారు. వారితో సమావేశమైన తర్వాత మధ్యాహ్నం చంద్రబాబు నాయుడిని కలుసుకుంటారు.

English summary
Jana Sena chief Pawan Kalyan will meet Andhra Pradesh CM Nara Chandrababu Naidu to discuss about capital area farmers' issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X