అప్పటికీ.. ఇప్పటికీ ఎంత మార్పు?

పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన గుర్తుంది కదా.. ఏపీలో రాజకీయ పునరేకీకరణకు దోహదపడిన పర్యటన అది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ విమానాశ్రయం నుంచి హోటల్ కు వెళ్లేవరకు మధ్యలో తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ర్యాలీ సాగే మార్గమధ్యంలో విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. చివరకు నోటీసులిచ్చి విశాఖ నుంచి పంపించారు. అప్పుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన పవన్ చెప్పు చూపిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 రాజకీయవర్గాల్లో చర్చ..

రాజకీయవర్గాల్లో చర్చ..


అక్టోబరు 15వ తేదీన జరిగిన ఆ పర్యటనలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అర్థరాత్రి సమయంలో హోటల్ లో తనిఖీలు.. పార్టీ నాయకుల అరెస్ట్.. జనవాణి నిర్వహించకుండా నిబంధనలు పాటించాలంటూ ఒత్తిడి.. లాంటి చర్యలతో జనసేన శ్రేణులు పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అదే పోలీసులు విమానశ్రయ సిబ్బందితో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యేందుకు విశాఖపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్ కు రక్షణగా నిలిచారు. బస చేసిన హోటల్ దగ్గర కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చూశారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విజయనగరంలో ఇళ్ల పథకం పరిశీలన

విజయనగరంలో ఇళ్ల పథకం పరిశీలన


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 13న విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం అమలు తీరును పరిశీలించనున్నారు. ఇక్కడ 397 ఎకరాల్లో పేదలందరికీ పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్‌ ఆ ఇళ్లకు శంకుస్థాపన కూడా చేశారు. గుంకలాంలో పేదల ఇళ్ల నిర్మాణ పరిస్థితి ఎలా ఉందో, ఇళ్లు ఏ స్థాయికి వచ్చాయో లబ్ధిదారులతో మాట్లాడి స్వయంగా వివరాలు తెలుసుకోనున్నారు.

ఇళ్ల కాలనీలపై సోషల్‌ ఆడిట్‌

ఇళ్ల కాలనీలపై సోషల్‌ ఆడిట్‌


జనసేన పార్టీ జగనన్న ఇళ్ల కాలనీలపై సోషల్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. 12 నుంచి వరుసగా మూడురోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. వీటిల్లో అవినీతి జరగడంవల్లే రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులు జగనన్న ఇళ్ల నిర్మాణం ఎలా ఉందో పరిశీలించనున్నారని, వాటి వివరాలను, వారి పరిశీలన ఫలితాలను సోషల్ మీడియాలో 14న 'జగనన్న మోసం' హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+