వైరల్ గా మారిన పవన్ కల్యాణ్ నిరాడంబరత

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బిజీగా ఉంటారు అనే విషయం తెలిసిందే. అభిమానులు ఆయనతో ఒక ఫొటో అయినా దిగితే చాలు అనే ఆశయంతో ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడైనా పవన్ కనపడినా దూరం నుంచేకానీ అంత సెక్యూరిటీ ముందు వారికి ఫొటోలు దిగడం సాధ్యం కాదు. రెండు రాష్ట్రాల్లోను ఆయనకు అభిమాన గణం చాలా ఎక్కువ.

మారిన ట్రెండ్ ప్రకారం ఒక సెల్ఫీ అయినా తీసుకుంటే చాలు అనుకుంటుంటారు. నాలుగు రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పవన్ కల్యాణ్ అందరికీ కేంద్ర బిందువుగా మారారు. చంద్రబాబునాయుడు పవన్ తో భేటీ అవడం కీలకంగా మారింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు తాను ఎంత ప్రాధాన్యం ఇస్తాను అనేది ఆయన ఒక ఉదాహరణతో నిరూపించారు.

Pawan Kalyan modesty in airport

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. అందులో పవన్ కల్యాణ్ ఎంత సింప్లిసిటీగా ఉంటారో తెలియజేస్తోంది. జనసేన పార్టీ నేతలతో కలిసి ఆయన విమానాశ్రయం లోపలికి వెళుతున్నారు. వపన్ కల్యాణ్ వస్తుండటాన్ని దూరం నుంచే ఒక మహిళా సిబ్బంది గమనించారు. వెంటనే తన అభిమాన నటుడితో ఒక సెల్ఫీ అయినా దిగాలని ప్రయత్నించారు. దూరం నుంచే పవన్ ఫొటోలో కనపడేలా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. ఆమె నిరాశ చెందుతున్న సమయంలో పవన్ ఆమెను దాటుకొని ముందుకు వెళ్లిపోయారు.

ముందుకు వెళ్లిపోయిన తర్వాత జరిగిన సంగతిని గుర్తించి ఒక్కసారిగా వెనక్కి వచ్చారు. ఆ మహిళతో సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అంత హడావిడిగా విమానాశ్రయం లోపలికి వెళుతూ తన అభిమాని కోసం ఆగి వెనక్కి వచ్చిన ఆయన నిరాడంబరత గురించి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పవన్ ను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. పవన్ ప్రస్తుతం రెండు సినిమాలకు తన షెడ్యూల్స్ కేటాయించారు. హరిహర వీరమల్లును పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటు సాయిధరమ్ తేజ్ తో కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత బస్సుయాత్రపై దృష్టిసారించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+