రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ వినూత్న ప్రయోగం!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న జనసేనకు నిధుల సమస్య తొలిచేస్తోంది. ఆ పార్టీకి వస్తున్న విరాళాలు తక్కువగా ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నడిపించాలంటే ఎంత వెచ్చించాలనేది ఊహకందనిది. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిసారించాలనే ఉద్దేశం పవన్ కల్యాణ్‌కు ఉన్నప్పటికీ పార్టీని నడపడం కోసమే ఆయన సినిమాలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలద్వారా వస్తున్న రెమ్యునరేషన్ నే జనసేన ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నారు.

కౌలు రైతులకూ సొంత సొమ్మే
మరోవైపు కౌలు రైతులు భరోసా యాత్ర నిర్వహిస్తున్న పవన్ వారికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నారు. అవి కూడా తన సొంత నగదు నుంచి, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచే అందజేస్తున్నారు. రాజకీయ పార్టీలకు బడా కార్పొరేట్ల నుంచి సాధారణంగా విరాళాలు అందుతుంటాయి.
ప్రస్తుతానికి ఇంకా జనసేనకు అందడంలేదు. ఆ పార్టీకి ఉన్న అంగ బలం, అర్థబలం జన సైనికులే. అందుకే కార్యకర్తలు, అభిమానుల అండతో ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కాలని జనసేన భావిస్తోంది. మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఆర్థికంగా ఎటువంటి సహకారం అందడంలేదు.

నాసేన కోసం నా వంతు
జనసేనకు విరాళాల సేకరణ కోసం నాగబాబు ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించారు. "నా సేన కోసం నా వంతు" అంటూ విరాళాలు సేకరిస్తున్నారు. వాస్తవానికి జనసేనకు విరాళాలివ్వాలనుకునేవారికి ఓ విండో ఎప్పుడూ అందుబాటులోనే ఉంది. దాని ద్వారా నెల నెలా సాయం చేస్తున్న జనసైనికులు చాలామంది ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో నిర్వహణ పరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయని పార్టీ భావిస్తోంది. వాటిని తట్టుకొని నడిపించాలంటే విరాళాలు కొంతవరకు సాయపడతాయని భావిస్తున్నారు.

ఆర్థిక పరిపుష్టి కోసం జన సైనికులు
జనసేనకు గతంలో విరాళాలు దండిగానే వచ్చేవి. కొన్ని కార్పొరేట్ సంస్థలు గత ఎన్నికల సమయంలో చేయూతనందించాయి. ఆ ఎన్నికల్లో పార్టీకి ఆరుశాతం ఓటింగ్ లభించింది. అంతేకాకుండా పవన్ కూడా రెండుచోట్ల ఓటమి పాలవడంతో పార్టీ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కొంతమంది నేతలు తమకు తోచిన విరాళాలు అందిస్తున్నప్పటికీ అది ఎటూ సరిపోవడంలేదు. సైనికులంతా కలిసి సహాయం చేస్తే పార్టీకి కొంతమేరకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. దీనిపైనే అధిష్టానం దృష్టిసారించింది.












Click it and Unblock the Notifications