చంద్రబాబుపై పవన్ అసహనం, ఏం చెప్పినా నో - ఇదీ పంచాయితీ..!!
ఏపీలో కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. జగన్ అటు వై నాట్ 175 అంటూ ఇంఛార్జ్ లను మారుస్తూ ముందుకు వెళ్తున్నారు. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ ను ఓడించాలని కలిసిన చంద్రబాబు పొత్తుతో బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నా..సానుకూల సంకేతాలు లేవు. ఇప్పుడు ఇదే చంద్రబాబు - పవన్ మధ్య పంచాయితీకి కారణమవుతోంది. పవన్ ప్రతిపాదనలకు చంద్రబాబు నో అంటున్నారు. దీంతో, లోకేష్ యువగళం ముగింపు సభకు పవన్ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.
పవన్ వాదన ఇలా : ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది పవన్ నినాదం. జగన్ ను ఓడించేందుకు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. తాను సీఎం కావటం కంటే జగన్ ఓటమి ముఖ్యమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే పొత్తు ప్రకటించారు. అటు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా..టీడీపీతో కొనసాగటానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఇప్పుడు తేడా కొడుతోంది. చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత పవన్ రెండు సార్లు కలిసారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రజల్లోకి వెళ్దామని ప్రతిపాదించినట్లు సమాచారం. బీజేపీ కోసం వేచి చూడకుండా రెండు పార్టీల నుంచి అభ్యర్దుల తొలి జాబితా ప్రకటిద్దామని ప్రతిపాదించారు. దీని ద్వారా రెండు పార్టీల్లోనూ ఎన్నికల జోష్ మొదలవుతుందని. నమ్ముకున్న వారికి సీట్లు ఇస్తే గ్రౌండ్ లో పని చేస్తారని సూచించారు.

వేగంగా స్పందించాలి : సాధ్యమైనంత త్వరగా మేనిఫెస్టో ప్రకటించాలని కోరారు. జనసేన నుంచి 50 సీట్లను పవన్ ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ, చంద్రబాబు ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చేది తేల్చలేదు. బీజేపీ ఇక రాదనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు. కానీ, చంద్రబాబు ఇంకా వేచి చూసే ధోరణితో ఉండటం పవన్ కు రుచించటం లేదు. బీజేపీ తనతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని..లోక్ సభకు వద్దనటం పవన్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఖాయంగా ఖరారు చేసే అభ్యర్దుల జాబితా ప్రకటించాలని కోరినా..చంద్రబాబు వేచి చూసే ధోరణి పవన్ కు నచ్చటం లేదు. తన మీద తన పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి పరిగణలోకి తీసుకోవాలని పవన్ సూచించారు. అయినా..చంద్రబాబు వేచి చూద్దాం..సరైన సమయంలో ప్రకటన చేద్దాం అంటూ దాటేస్తుండటం పవన్ లో అసహనం పెంచుతోంది.

చంద్రబాబు నిర్ణయం ఏంటి : అటు జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తూ..జనవరిలో పథకాలను అమలు చేస్తున్న విషయం చర్చకు వచ్చింది. చివరి నిమిషంలో అభ్యర్దులను..మేనిఫెస్టో ప్రకటిస్తే నష్టపోతామని పవన్ హెచ్చరించినట్లు సమాచారం. కానీ, చంద్రబాబు ఇంకా బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీతో అవసరమని పవన్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ అవసరమైతే..వీరిని కాదని కాంగ్రెస్ తోనూ వెళ్లటానికి అభ్యంతరం లేదనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో..లోకేష్ యువగళం ముగింపు సభకు తొలుత పవన్ హాజరు కావాలని భావించినా..ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. సీట్ల ఖరారు..అభ్యర్దుల ప్రకటన వంటి వాటి పైన ముందడుగు వేస్తే తాను ఎప్పుడు పిలిచినా వస్తానని పవన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications