'రహస్య పూజలపై' జనసేన దమ్మతిరిగే కౌంటర్! ఆ లోపు వెళ్లిపోవాలని పవన్‌కు పోలీస్ ఆదేశాలు

జంగారెడ్డిగూడెం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం వేకువజామున పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించారనే అంశం ఉదయం నుంచి మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయనపై దుష్ప్రచారం జరుగుతున్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఆలయంలో పూజలు చేశారని, సోమవారం వేకువజామున మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్య అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారని అర్చకులు కూడా చెప్పారని అన్నారు. అలాంటప్పుడు రహస్య పూజలు అని చెప్పడం ఏమిటని అంటున్నారు. కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు.

దిమ్మతిరిగేలా ట్వీట్

పవన్ కళ్యాణ్ రహస్య పూజలు అని కొందరు పేర్కొన్నారు. అయితే అలా వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారి దిమ్మతిరిగేలా జనసేన పార్టీ సోమవారం మధ్యాహ్నం ఈ పూజలకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. 'ఈరోజు తెల్లవారుజాము 3:30 గంటలకు జంగారెడ్డిగూడెం మండలంలోని I.S జగన్నాధపురం గ్రామంలోని ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు' అని పేర్కొన్నారు.

పవన్ బిజీ షెడ్యూల్

పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ వేకువజామునే పూజలు నిర్వహించి ఉండవచ్చు. పూజలు రహస్యంగా చేసినట్లుగా ఏమీ లేవు. ఆయన వెంట చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు రహస్య పూజలు అని చెప్పడం ఏమిటని అంటున్నారు. గతంలో ఇదే ఆలయంలో పవన్ తాంత్రిక పూజలు చేశారని ఆయన వ్యతిరేకులు ఆరోపించారు. ఇటీవల పవన్ పైన విరాళాలపై ఆరోపణలు చేసిన వారు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పూజారులు ఉండగా, పవన్ వెంట ఎంతో మంది ఉండగా రహస్య పూజలు అని చెప్పడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ పరామర్శ

పవన్ కళ్యాణ్ పరామర్శ

కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు కాంట్రాక్టర్లను మార్చడంలో ఆసక్తి కనబరుస్తున్నారని, నిర్వాసితుల గోడు మాత్రం పట్టడం లేదన్నారు.

ఐదులోపే విలీన మండలాలు వదిలి వెళ్లాలని ఆదేశాలు

ఐదులోపే విలీన మండలాలు వదిలి వెళ్లాలని ఆదేశాలు

కాగా, వేలేరుపాడు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల్లోపే విలీన మండలాలు వదిలి వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+