చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడని తెలుసు, జగన్‌ది తప్పు, అందుకే మద్దతివ్వలేదు: పవన్, వైయస్‌పై..

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: తన రాజకీయ ప్రయాణంలో తాను పొరపాట్లు చేస్తానేమో కానీ తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖలో జనసేన భేటీలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. తనకు ఎలాంటి ఎమోషన్స్ లేవన్నారు. ఎన్నో దెబ్బలు తిన్న తనకు ఎమోషన్స్ ఎందుకు ఉంటాయన్నారు.

చిరంజీవిని బలిపెట్టిన స్వార్థపరుల్ని మర్చిపోలేదు, చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్తా: పవన్ కళ్యాణ్

పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్ర విభజన చేశారని పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఆ ఆగ్రహంతోను వేరే పార్టీలకు మద్దతిచ్చానని చెప్పారు. కార్యకర్తగా అన్నీ అర్థం చేసుకోవాలనే తాను ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేయలేదని చెప్పారు. నాడు మోడీని కలిస్తే కొందరు రకరకాలుగా మాట్లాడారని, ఈ రోజు మోడీని బలంగా విమర్శిస్తున్నప్పుడు వాళ్లు ఏమయ్యారని ప్రశ్నించారు. కొందరికి వేల కోట్ల సంపాదన పిచ్చి అని, మరికొందరికి ఎప్పటికీ అధికారంలో ఉండాలనే పిచ్చి అని, నాకు మాత్రం ప్రజలు బాగుండనాలనే పిచ్చి అన్నారు.

పవన్ కల్యాణ్ క్లియర్: బిజెపిపై దండయాత్రనే, వైఎస్‌పై కాస్తా..

అన్నయ్యకు చెప్పా, అహంకారం తీసేశా, బీజేపీ హిందూ మతానికి: పవన్ కళ్యాణ్ నోట సంచలనం

మీకు హక్కులేదు, జైలుకెళ్తా, లాఠీ దెబ్బలు తింటా, మోడీని ఏదీ అడగలేదు, నా సత్తా చూపిస్తా: ఊగిపోయిన పవన్

జగన్‌ది అది తప్పు, నిరుపించుకోవాలి

జగన్‌ది అది తప్పు, నిరుపించుకోవాలి

వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అనుకోవడం అవివేకమని పవన్ కళ్యాణ్ అన్నారు. వారసులు రాజకీయాల్లో నిరూపించుకోవాలని సూచించారు. నా తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి నేను అవుతా అంటే తప్పు అన్నారు. నా తండ్రి చనిపోయాడు కాబట్టి నేనే సీఎం అంటే ఎలా అన్నారు.

 వైయస్ మంచి చేశారు, అవినీతి ఉంది, జగన్‌తో వైరం లేదు

వైయస్ మంచి చేశారు, అవినీతి ఉంది, జగన్‌తో వైరం లేదు

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కొన్ని మంచి పనులు చేశారని, ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఆయన చేసిన అవినీతి కూడా ఉందన్నారు. తనకు జగన్‌తో వైరం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

 ఎవడీ పవన్ కళ్యాణ్ అన్నారు, విభజన విధానం దెబ్బతీసింది

ఎవడీ పవన్ కళ్యాణ్ అన్నారు, విభజన విధానం దెబ్బతీసింది

ఎవడీ పవన్ కళ్యాణ్ అని గతంలో ఓవైసీ అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తనపై ఎవరు ఏం మాట్లాడారో అన్నీ గుర్తున్నాయని చెప్పారు. తాను ఎవరి మాటలు మరిచిపోలేదన్నారు. రాష్ట్ర విభజన చేసిన పద్ధతి విషయంలో కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరూ దొంగలేమో అనిపిస్తోంది

ఇద్దరూ దొంగలేమో అనిపిస్తోంది

ఓ వైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం లక్షల కోట్ల దోపిడీ అంటున్నాయని, చూస్తుంటే ఇద్దరు దొంగలేమో అనిపిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు పార్టీలు దోచుకుంటే ఇక ప్రజలకు ఏం చేస్తాయని ప్రశ్నించారు.

యువత అంటే లోకేష్, జగన్ కాదు

యువత అంటే లోకేష్, జగన్ కాదు

మంత్రి నారా లోకేష్ సామర్థ్యం గురించి చంద్రబాబుకు తెలియాలని పవన్ కళ్యాణ్ అన్నారు. యువత అంటే లోకేష్ లేదా జగన్ కాదని చెప్పారు. సమాజం బాగుపడాలన్నదే తన పిచ్చి అన్నారు. ఎవరూ గుడ్డిగా ఫాలో కావొద్దన్నారు. ఆలోచనా శక్తి ఉన్న నాయకులు బలమైన నాయకులు కావాలన్నారు.

 చంద్రబాబు వాడుకొని వదిలేస్తారని చెప్పారు, నాకు తెలియదా

చంద్రబాబు వాడుకొని వదిలేస్తారని చెప్పారు, నాకు తెలియదా

చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తాడని చెప్పారని, ఆ విషయం నాకు తెలియదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. కొంతమంది వేల కోట్లు సంపాదించారన్నారు. యథారాజా తథా ప్రజ అన్నట్లు ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ప్రజలు చేస్తారన్నారు. అధికార దుర్వినియోగంతో అవినీతి సొమ్మును కొందరు వెనుకేసుకున్నారని చెప్పారు.

 అందుకే జగన్‌ను వ్యతిరేకించా, పీఆర్పీకి ఉన్న బలం లేదు

అందుకే జగన్‌ను వ్యతిరేకించా, పీఆర్పీకి ఉన్న బలం లేదు

అవినీతి కారణంగానే తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ అంటే తనకు వ్యక్తిగత వ్యతిరేకత లేదన్నారు. తాను పదిహేను రోజులు జ్వరంతో బాధపడ్డానని చెప్పారు. ప్రజారాజ్యంకు ఉన్న బలం తనకు లేదని చిరంజీవి అన్నారు. తన పార్టీ ఖర్చులు కూడా పెట్టే స్థితి లేదన్నారు.

 ప్రజారాజ్యంలా అవుతుందని మాట రావొద్దనే

ప్రజారాజ్యంలా అవుతుందని మాట రావొద్దనే

ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే జనసేన అవుతుందనే మాట రాకూడదనే నేను నా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. జవాబుదారీ కావాల్సిన రాజకీయ వ్యవస్థ రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena Party chief Pawan Kalyan talk about Chiranjeevi, Praja Rajyam, Narnedra Modi, YS Jagan and Janasena.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి