వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు చేయాలంటే మేధావే కావాలా?: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

సామాన్య ప్రజలు కూడా రాజకీయాలు చేయగలరని నిరూపించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సామాన్య ప్రజలు కూడా రాజకీయాలు చేయగలరని నిరూపించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడారు.

రాజకీయాలు చేయడానికి మహా మేధావి కావాల్సిన అవసరం లేదని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రజలు నిజాయితీగా, చిత్తశుద్ధితో ఉంటే విలువలు కలిగిన రాజకీయం రాజకీయం సాధ్యమని చూపించడమే జనసేన లక్ష్యమని తెలిపారు.

 pawan kalyan on present politics

అందు తాము వినూత్నంగా పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారని పవన్ తెలిపారు. దీనికిభారీ ఎత్తున స్పందన కూడా రావడం గమనార్హం. కాగా, పవన్ ఆదివారం మాట్లాడుతూ.. త్వరలో అనంతపురం నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అలాగే అనంతపురం జిల్లా నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. అవసరమైతే సినిమాలక కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమని పవన్ తెలిపారు.

సేవా దళ్ ఏర్పాటు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీ పరిపాలన కార్యాలయంలో జనసేన సేవాదళ్‌ ఆవిర్భావ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ సేవాదళ్‌ను ప్రారంభించారు. ప్రజలకు సేవ చేయడానికి సేవాదళ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 అంశాలతో నియమావళిని ప్రకటించారు. దీన్ని ప్రతి కార్యకర్త పాటించాలని కోరారు. రాబోయే రోజుల్లో సేవాదళ్‌ను విస్తృత పరుస్తామని పేర్కొన్నారు. తొలుత జిల్లా స్థాయిలో 100 మంది కార్యకర్తలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

English summary
Janasena President Pawan Kalyan on Monday responded on present politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X