ముగిసిన గడువు, లెక్కలోకి తీసుకొని ప్రభుత్వం!: రేపు పవన్ కళ్యాణ్ దీక్ష, అనుమతికి దరఖాస్తు

అమరావతి/శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్ లైన్ శుక్రవారం ముగిసింది. సమస్యపై వెంటనే చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలని, 48 గంటల సమయం ఇస్తున్నానని జనసేనాని బుధవారం అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

    JanaSena Party Chief Pawan Kalyan interaction with Uddanam Kidney Patients

    ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడంతో పవన్ ఒక్కరోజు దీక్షకు సిద్ధమయ్యారు. అసలు పవన్ అల్టిమేటాన్ని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదని అంటున్నారు. దీంతో దీక్షకు దిగుతున్నారు. ఈ మేరకు జనసేన పోలీసులకు దరఖాస్తు చేసింది. శనివారం ఒక్కరోజు పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు.

    Pawan Kalyan one day deeksha for Uddanam kidney disease

    ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలని, వెంటనే ఆరోగ్య శాఖకు మంత్రిని నియమించాలని పవన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని దీక్ష నిర్ణయం తీసుకున్నారు.

    పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్రను భద్రతా కారణాల వల్ల గురువారం, శుక్రవారం నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు, అదే సమయంలో ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో దీక్షకు పూనుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+