వారికి ఆస్తి పన్ను ఉండదు..పవన్ సంచలన నిర్ణయం..!
భారత రక్షణ దళాల్లో సేవలందిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సహా భారత రక్షణ దళాలకు సేవలందిస్తున్న సైనికులకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. సైనికుల పట్ల కృతజ్ఞత సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న ఈ ముఖ్య నిర్ణయం తీసుకున్నట్టు పవన్ అనౌన్స్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రక్షణ దళాలకు చెందిన సిబ్బందికి ఆస్తి పన్ను మాఫీ కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రయోజనం రిటైర్డ్ సైనికులకు లేదా సరిహద్దుల్లో సేవలు నిర్వహిస్తున్న వారికి మాత్రమే వర్తించేది. అయితే ఇప్పుడు దీనిని మరింత విస్తరించుతూ, దేశ రక్షణలో ఉన్న అన్ని విభాగాల ప్రస్తుత ఉద్యోగులకూ ఈ మాఫీ వర్తింపజేయనున్నట్టు స్పష్టం చేశారు.

ఈ ఆస్తి పన్ను మినహాయింపు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్ వంటి విభాగాలకు వర్తించనుంది. ఇకపై ఈ సౌకర్యం ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులకు అందుబాటులో ఉండనుంది. వారు ఉన్నత స్థాయిలో ఎక్కడైనా పని చేస్తున్నా సరే, వారికి లేదా వారి భార్యకు కలిపి ఒక్క ఇంటికి ఈ మాఫీ వర్తించనుంది. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. దేశాన్ని రక్షిస్తున్న సిబ్బంది కోసం గౌరవతలంపుగా నిలుస్తుందన్నారు పవన్. వారి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఈ మాఫీని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత రక్షణ దళాల సేవలు అమూల్యమైనవని కొనియాడుతూ.. వారిని గౌరవించడం మన కర్తవ్యమని ట్వీట్ లో రాసుకొచ్చారు. జై హింద్.. భారత్ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు.
Andhra Pradesh Stands with Our Soldiers
— Pawan Kalyan (@PawanKalyan) May 11, 2025
As a mark of deep respect and gratitude to our brave soldiers, the Andhra Pradesh NDA government Under the leadership of Hon'ble CM Sri @ncbn garu, PanchayatRaj Department has taken a significant decision, to grant property tax exemption…












Click it and Unblock the Notifications