Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నయ్య మాట చెంపపై కొట్టినట్లు: చిరు పాట పాడిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన అన్నయ్య, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పాట పాడారు! ఆదివారం నాడు పవన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారోనని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవన్ జనసేన పార్టీని స్థాపించి, బీజేపీ - టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అంతకుముందే, చిరు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పటి నుండి పవన్ దూరంగా ఉంటున్నారు.

ఎన్నికల తర్వాత మెగా సినిమా ఫంక్షన్లు కొన్ని జరిగాయి. వాటికి పవన్ హాజరు కాలేదు. ఆదివారం మాత్రం గోపాల గోపాల ఆడియో విడుదల సమయంలో పవన్ తన అన్నయ్యను మరీమరీ గుర్తు చేసుకున్నారు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానం పట్ల ఉద్వేగానికి లోనయ్యారు. తన గుండె నిండా అభిమానులే ఉన్నారన్నారు.

 Pawan Kalyan praises Chiranjeevi after long time

తానెప్పుడూ దేవుడ్ని ఏది కోరలేదని, కానీ కొందరు ఫ్యాన్స్ వచ్చి ఒక్క హిట్ సినిమా ఇవ్వు అని కోరటంతో, అది కావాలని దేవుడిని ప్రార్థించానని చెప్పారు. గబ్బర్ సింగ్ రూపంలో అది వచ్చిందని, తాను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదని, కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ గురించి ఆలోచిస్తానని చెప్పారు.

ఫ్యాన్ లేకపోతే పవన్ లేడన్నారు. ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తానన్నారు. తనకు కథలు ఎంపిక చేయటం రాదని కొందరు చెప్తారు కానీ, కథలు ఎలా ఎంచుకోవాలో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే అన్నయ్య చిరంజీవి నేర్పించారన్నారు. ఇంతకు ముందు సినిమాల్లో పాటలు వస్తే నడుస్తూ వెళ్లే తాను ఈ మూవీలో అయితే కాస్త డాన్స్ చేశానన్నారు.

అన్నయ్య రమ్మనడంతో ఊరినుంచి హైదరాబాద్‌ వచ్చానని చిరంజీవి పిలిచిన విషయమై చెప్పారు. ఇక్కడకు వచ్చాక యోగ, ధ్యానంలో మునిగిపోయి ఏమీ పట్టించుకునేవాణ్ణి కాదని, అన్నయ్య ఏం చేస్తున్నావని అడిగినప్పుడల్లా యోగ, ధ్యానం చేస్తున్నానంటూ, ఆయన్ని కూడా చెయ్యమనీ సలహా ఇచ్చేవాణ్ణని, దాంతో ఓసారి కష్టపడే అన్నయ్య, వండిపెట్టే వదిన ఉంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయని, అప్పుడు నువ్వు ఎన్ని కథలైనా చెప్తావని, నీ వంతు కృషిచేసి, ఏదైనా సాధించినప్పుడు నీకు బాధ్యతనేది తెలుస్తుందని హితబోధ చేశాడన్నారు.

అన్నయ్య చెప్పిన ఆ మాటలు చెంపమీద కొట్టినట్లు అనిపించిందన్నారు. సినిమాల్లో కష్టపడి సాధించిన తర్వాత అన్నయ్య మాటల్లోని నిజం అర్థమైందని, చివరి శ్వాస వరకూ ఆ మాటలు గుర్తుంటాయన్నారు. తాను పెద్దగా చదువుకోలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+