Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్, ప్రేమలతతో ఆపరేషన్: దక్షిణాదిపై మోడీ పావులు

న్యూఢిల్లీ: కాబోయే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పుడే దక్షిణాది పైన దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీకి ఉత్తరాదిన మంచి పట్టు ఉంది. దక్షిణ భారత దేశంలో మాత్రం ఆ పార్టీకి అంత పట్టు లేదు. తరుచూ ఇతర పార్టీలతో కలిసి దక్షిణాదిన పోటీ చేస్తూ ఉంటుంది. గతంలో కర్నాటకలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నాడు కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి గాలి జనార్ధన్ రెడ్డి, యడ్యూరప్పల సొంత బలమే ఎక్కువ కారణం. ఇప్పుడు బిజెపి కేంద్రంలో సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తమకు పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ తమది ఎన్డీయే ప్రభుత్వమేనని, మిత్ర పక్షాలను కలుపుకొని వెళ్తామని చెబుతున్నారు. అంతేకాదు కూటమిలోని ముఖ్య పార్టీలకు కేంద్రమంత్రివర్గంలో అవకాశం కూడా ఇస్తున్నారు.

ఉత్తరాదిన బిజెపికి మంచి పట్టు ఉంది. దక్షిణాదిన మాత్రం లేదు. దీనిని గుర్తించిన మోడీ దక్షిణాదిలో ముఖ్య రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులలో పార్టీ బలం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని లేదా కూటమిని బలంగా తయారు చేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఎపి నుండి పవన్ కళ్యాణ్‌కు, తమిళనాడు నుండి విజయకాంత్ సతీమణి ప్రేమలతకు రాజ్యసభ పదవులు ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది మోడీ వ్యూహంలో భాగమేనని అంటున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన ఆంధ్రప్రదేశ్(తెలంగాణ, సీమాంధ్ర)లో 42 లోకసభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో 2019లో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరుగుతాయి. ఆ లోగా పార్టీని బలోపేతం చేయడంపై మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్‌కు మోడీ చాలా ప్రాధాన్యతనిస్తున్నారు. ఎన్డీయే కూటమి సమావేశానికి ఫోన్ చేసి ఆహ్వానించారు. కూటమిని లేదా పార్టీని తెలంగాణ, సీమాంధ్రలో బలోపేతం చేసే ఉద్దేశ్యంలో భాగంగా పవన్‌కు రాజ్యసభ ఇవ్వవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రేమలత

ప్రేమలత

తమిళనాడులో బిజెపికి ఎపిలో ఉన్నంత బలం కూడా ఉండదు. అక్కడ జాతీయ పార్టీల బలం ఏమాత్రం కనిపించదు. తమిళ సెంటిమెంట్ కారణంగా డిఎంకె, అన్నాడిఎంకెలదే హవా. అయితే ఈసారి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్న బిజెపి రెండు స్థానాలను కైవసం చేసుకుంది. డిఎండికె అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత 39 లోకసభ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీనిని మోడీ గుర్తించారు. 2016లో తమిళనాడులో శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా బలోపేతం చేసే ఉద్దేశ్యంలో భాగంగా విజయకాంత్ సతీమణి ప్రేమలతను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. ఆమెను రాజ్యసభకు పంపిస్తే మంత్రి పదవి కూడా ఇచ్చి తమిళనాడులో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఇటీవలి ఎన్నికల్లో తమిళనాడులో జయలలిత తర్వాత అత్యంత ప్రభావం చూపిన మహిళా నేతల్లో ప్రేమలత కూడా ఉన్నారు. ప్రేమలత ప్రచారానికి మోడీ కూడా ముగ్ధులై.. రెండు రోజుల క్రితం ఎన్డీయే సమావేశంలో ఆమెను ప్రత్యేకంగా పిలిచి అభినందించారు.

యడ్యూరప్ప

యడ్యూరప్ప

కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నుండి బిజెపికి కొంత పట్టు కనిపిస్తోంది. దానికి తోడు యడ్యూరప్ప, శ్రీరాములు వంటి వారు తిరిగి పార్టీలోకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో మరోసారి బిజెపి కర్నాటకలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

చిరంజీవి

చిరంజీవి

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని బిజెపిలోకి రప్పించేందుకు ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. వెంకయ్య నాయుడు మధ్యవర్తిత్వం నెరపుతున్నారట. చిరు, పవన్‌లు కలిస్తే తిరుగు ఉండదని మోడీ, బిజెపిలు భావిస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+