ఎవడబ్బ సొమ్ము..దోచుకోవటానికి: పులివెందుల సీటు బీసిలకు ఇస్తావా: కాపు నేతగా చూస్తున్నారు : పవన్
సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్నాను. రాజకీయాల్లో నాకు శత్రులెవరూ లేరు. వైసీపీ అధినేత జగన్ విధానాలను ప్రశ్నిస్తే... నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నారు..అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పలు అంశాల పై ప్రసంగించారు. పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. తాను కులాలను కలిపే రాజకీయం చేస్తానని స్పష్టం చేసారు.

వెనుడుగు వేయను..
తెలుగు ప్రజల సుస్థిరత కోసమే గతంలో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చా. అడుగేస్తే తలతెగాలి కానీ... వెనుకడుగు వేయను. నాలుగేళ్లుగా ఎంత తిట్టినా, బెదిరించినా వెనక్కి తగ్గలేదు. రూ.వేల కోట్లు ఉంటేనే రాజకీయాల్లో రాణించగలమన్నారు
పవన్ కళ్యాన్. తాను చంద్రబాబు ను పల్లకీ లో మోసింది..ప్రజలకు మంచి చేస్తారని కానీ, అవినీతి ని ప్రోత్సహించటాని కి కాదని చెప్పుకొచ్చారు. జనసేన రెండు జిల్లాలకే పరిమితం అంటున్నారు..జనసేన ఏపి మొత్తం ప్రభావితం చేస్తుంద ని వివరించారు. ముఖ్యమంత్రి అంటే ధర్మకర్త అని...కానీ, ఏ మూలకెళ్లినా అవినీతితో ప్రజలు విసిగిపోయారని పేర్కొ న్నారు. తనకు లోకేశ్..జగన్ ఎవరి మీదా శత్రుత్వం ఎందుకు ఉంటుందన్నారు. రాజకీయంగా తనను తిడితే భరిస్తాన ని చెప్పిన పవన్ సామాన్య ప్రజల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. అవినీతి గురించి మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్ము ఇదని..దోచుకుంటుంటే చూస్తూ కూర్చుంటామని ప్రశించారు.

పులివెందుల సీటు బిసిలకు ఇస్తారా
రాజకీయ నేతలు తనను కాపు నేతగా చూస్తున్నారని..తనకు కులం - ప్రాంతం లేదని మరో సారి స్పష్టం చేసారు. జగన్ పై విధాన పరమైన విమర్శలు చేస్తే వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారన్నారు. నా సమస్యలు..ఇబ్బందులు వీరికేం తెలుసు అని ప్రశ్నించారు. తన కారణంగా..తన అన్నకు..కట్టుకున్న వారికి..పిల్లలకు సుఖం ఉండదన్నారు. జగన్ లాగా బిసి సదస్సులు పెట్టనని..తన పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో బిసిలకు ఇచ్చిన ప్రాధాన్యత చూడాలని సూచించారు. కడప పార్లమెంట్..పులివెందుల సీటు బిఇలకు ఇస్తారా అని పవన్ వైసిపి అధినేత జగన్ ను నిలదీసారు. ఏపిలో రెండు వర్గాలకు చెందిన వారే పాలకులుగా ఉంటారని..మూడో వర్గంగా మీరెందుకు రాకూడదని చాలా మంది ప్రశ్నించిన విషయాన్ని పవన్ వివరించారు. రెడ్డి అంటే కులం కాదని..ధర్మాన్ని రక్షించేవాడని..అన్యా యాన్ని ఎదరించేవాడని మరో సారి చెప్పుకొచ్చారు.

పాకిస్థాన్ పై కాదు..నిరుద్యోగం పై ...
తాము యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని..పార్టీ మేనిఫెస్టోలోనూ యువతకు సంబంధించిన అంశాలకే ప్రాముఖ్యత ఇచ్చామని పవన్ వెల్లడించారు. పాకిస్థాన్ మీద యుద్దం..నిరుద్యోగం మీద చేయండి అంటూ పిలుపునిచ్చారు. 2014 లో దేశ భక్తుడుగా ప్రధానికి పవన్ కళ్యాణ్ కనిపించారని..ఇప్పుడు ప్రధాని తనను మర్చిపోయారని పేర్కొన్నారు. తన కు ఎవరి గుర్తింపు అవసరం లేదని చెబుతూనే తాను నాడు ఉన్న పరిస్థితుల్లో మోదీ ప్రధాని కావాలని కోరుకున్నానని గుర్తు చేసారు. తనకు యుద్దం చేయటమే తెలుసని..గెలుపు ఓటములను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. తాను ఆళ్లగడ్డ లో మాట్లాడితే పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ దాకా వినిపించిందని..ఇప్పుడు కూడా తాను చెప్పే మాటలు వినబడాలని అన్నారు. పార్టీ అవిర్భావ సభలో జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.












Click it and Unblock the Notifications