పాకిస్తాన్ పేపర్లో వస్తుందని నాకేం తెలుసు, నోట్ల రద్దుపై 2014లోనే చర్చ: పవన్ కళ్యాణ్
చిత్తూరు: మీడియాలో నేను ఏదైనా మంచి మాట మాట్లాడితే చూపించరని, నేను అనని మాటని మిస్ ఇంట్రస్ట్ చేసి పదేపదే చూపిస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. భగత్ సింగ్ గురించి తాను మాట్లాడినప్పుడు నేను అన్నది ఏమిటి, మీరు చూపించింది ఏమిటని, అలాగే ఆళ్లగడ్డలో ఒక మాట మాట్లాడితే పాకిస్తాన్ పేపర్లో వచ్చేస్తుందని కలకంటానా అని ప్రశ్నించారు. అది పట్టుకొని మీరు నా దేశభక్తిని శంకిస్తారా అన్నారు.
టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీల సభల్లో ఏనాడైనా జాతీయ జెండాలు పట్టుకున్నారా అన్నారు. నా దేశ భక్తి గురించి వాళ్లు మాట్లాడటమా అన్నారు. కేవలం జనసేన పార్టీలో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయన్నారు. నా దేశభక్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు (జీవీఎల్ నర్సింహా రావును ఉద్దేశించి) నా గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆయన కారు ఇద్దరిని వ్యక్తుల్ని గుద్దేసి, అందులో ఒకరు మృతి చెందితే ఆగకుండా మరో కారులో వెళ్లిపోయాడని, అలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడుతారా అని పవన్ ప్రశ్నించారు. మానవత్వం కూడా లేని వ్యక్తి మాట్లాడుతున్నారన్నారు. 1997లో తెలంగాణ వచ్చేస్తుందని చెప్పారని, 2014లో తెలంగాణ వస్తుందని వారికి ముందే ఏమైనా తెలుసునా అని బీజేపీని నిలదీశారు.
ప్రధాని నరేంద్ర మోడి 2014 ఎన్నికల సమయంలో ఉండగానే, తనకు, ఆయనకు మధ్య పెద్ద నోట్ల రద్దు చేయాలన్న మాటపై చర్చ జరిగిందని, అలా అయినంత మాత్రాన ముందే ప్లాన్ చేసినట్లా అన్నారు. ఉగ్రవాదులు ఉన్నారని, అలాగే దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పారు. దేశ అంతర్గత సమగ్రతను నిలువరించే వ్యక్తులు ఉన్నారని, వారిని నిలువరించడం దేశభక్తి కాదా అన్నారు.












Click it and Unblock the Notifications