• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ట్రెండ్‌ను ఫాలో అవ్వను.. ట్రెండ్‌ను సెట్ చేస్తా!!

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో, ఎంపీలు లోకసభలో ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ బలంగా ఆకాంక్షిస్తున్నారు. అందుకణుగుణంగా ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలైనప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో పార్టీ జెండా రెపరెపలాడింది. అక్కడి నుంచి విజయం సాధించిన రాపాక వరప్రసాదరావు వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతుండటంతో అసెంబ్లీలో జనసేన జెండా చూడాలన్న పవన్ కోరిక అలాగే మిగిలిపోయింది.

సినిమాలపై వచ్చే ఆదాయమే పార్టీకి..

సినిమాలపై వచ్చే ఆదాయమే పార్టీకి..


ప్రస్తుతం సినిమాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పార్టీకి వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రయివేటు సంస్థలద్వారా సర్వేలు చేయిస్తూ బలమున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు సాధించడానికి అవకాశం ఉంది? ఎక్కడెక్కడ గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచాం? అత్యధిక ఓట్లు వచ్చిన నియోజకవర్గాలెన్ని? వాటిల్లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఉభయ గోదావరి జిల్లాల్లో ఎటువంటి వ్యూహం అవలంబించాలి? తదితర విషయాలపై కూలంకుషంగా శోధిస్తున్నారు. పార్టీ నేతలతో చర్చల సందర్భంగా వచ్చిన సమాచారన్ని, సర్వేలో వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకుంటున్న పవన్ కల్యాణ్ తన తదుపరి అడుగు వేయబోతున్నారు.

పూర్తిస్థాయిలో పార్టీని నడపాలన్నా రూపాయి అవసరమవుతోంది!

పూర్తిస్థాయిలో పార్టీని నడపాలన్నా రూపాయి అవసరమవుతోంది!


విజయ దశమి సందర్భంగా ప్రారంభించాలనుకున్న బస్సు యాత్రను ప్రస్తుతానికి వాయిదా వేశారు. సినిమాలు కూడా త్వరత్వరగా పూర్తిచేసేందుకు రెండు సినిమాలకు కాల్ షీట్లు కేటాయించారు. అంతేకాకుండా పార్టీ బలోపేతం పై దృష్టి సారించిన పవన్ మరో నాలుగు సినిమాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వాటిద్వారా వచ్చే నగదును భవిష్యత్తులో పార్టీ ఎదుర్కోబోయే ఎన్నికల సందర్భంగా ఖర్చుపెట్టాలని నిర్ణయించారు. పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీని నడపాలనుకుంటున్నప్పటికీ నగదు అవసరపడుతుండటంతో సినిమాలు చేయక తప్పని పరిస్థితిని పరిస్థితులు కల్పిస్తున్నాయి.

ఇతర పార్టీలకు ధీటుగా నిలబడాలన్నా రూపాయి కావాలి..!!

ఇతర పార్టీలకు ధీటుగా నిలబడాలన్నా రూపాయి కావాలి..!!


రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీలకు ధీటుగా నిలబడాలన్నా.. జనసేన బలం పెరిగిందని నిరూపించాలన్నా రూపాయి అవసరపడుతోంది. ప్రజలకు ఎన్నికల్లో నగదు పంచడానికి ఆయన పూర్తి వ్యతిరేకం. అన్ని రాజకీయ పార్టీల ధోరణిలోనే పయనిద్దామంటూ పార్టీలోని కీలక నేతలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ తాను పోటీచేసే నియోజకవర్గంతోపాటు కీలక నేతలు పోటీచేసే నియోజకవర్గాల్లో కూడా రూపాయి ప్రస్తావన వద్దని స్పష్టం చేస్తున్నారు. చదువుకున్నవారు, పట్టణ వాసులు, ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేయబోతున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో అయితే ఓటర్ల ఆలోచనా విధానం తన మనస్తత్వానికి సరిపోతుందని పవన్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి వాయిదా వేసిన బస్సుయాత్రను కూడా సినిమా షూటింగ్ లు పూర్తయిన తర్వాత ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికలకు సంబంధించి పూర్తి స్పష్టతతోనే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

English summary
Janasena's Pawan Kalyan strongly wants Janasena's MLAs to be in the AP Assembly and MPs to be in the Lok Sabha in the next election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X