పవన్ కల్యాణ్‌లో పరివక్వత: కుర్చీ వద్దని... మహిళలతో స్టార్ట్ చేసి...

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ నేతగా క్రమంగా పరిపక్వత సాధించారనే మాట వినిపిస్తోంది. విశాఖపట్నం కార్యకర్తల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడిన తీరు ఈ విషయాన్ని పట్టిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే సమయంలో కార్యకర్తలకు తాను దగ్గరగా ఉంటానని, వారికి తనకూ తేడా లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. గతంలో చాలా ఆవేశంతో కొన్నిసార్లు ఊగిపోయినట్లు కనిపిస్తూ, కొన్నిసార్లు తడబడుతూ మాట్లాడేవారు. ఇప్పుడు ఆ తడబాటు గానీ, అతి ఆవేశం గానీ ఆయన ప్రసంగంలో కనిపించలేదని అన్నారు.

పవన్ కల్యాణ్ క్లియర్: బిజెపిపై దండయాత్రనే, వైఎస్‌పై కాస్తా..

కార్యకర్తలకు, ప్రజలకు సూటిగా తాకే విధంగా ఆయన ప్రసంగాలు సాగాయని అంటున్నారు. ఇదే ఆయన రాజకీయంగా పరిపక్వత సాధించారని చెప్పడానికి నిదర్సమనే మాట వినిపిస్తోంది.

పార్టీ బలోపేతంపై దృష్టి..

పార్టీ బలోపేతంపై దృష్టి..

పార్టీని బలోపేతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఉత్తరాంధ్ర కార్యకర్తలతో సమావేశమయ్యారు. బుధవారం ఉదయమే విశాఖకు చేరుకున్న పవన్ తొలుత.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల రిలే దీక్షలో పాల్గొన్నారు. భోజన విరామం తర్వాత కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.

చిరంజీవిని బలిపెట్టిన స్వార్థపరుల్ని మర్చిపోలేదు, చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్తా: పవన్ కళ్యాణ్

కుర్చీ వద్దన్న పవన్ కల్యాణ్

కుర్చీ వద్దన్న పవన్ కల్యాణ్

సమావేశానికి రాగానే నిర్వాహకులు పవన్ కల్యాణ్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. సమావేశం ఏర్పాట్లలో భాగంగా వేదికపై పవన్ కల్యాణ్ మాత్రమే కూర్చునేందుకు ఒక కుర్చీ ఉంచారు. అయితే పవన్ తనకు కుర్చీ అవసరం లేదని చెప్పారు. దాంతో సిబ్బంది వెంటనే కుర్చీని అక్కడి నుంచి తొలగించారు. పవన్ కల్యాణ్ నిలబడే ప్రసంగించారు.

సిఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

సిఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

పవన్ కల్యాణ్ వేదిక మీదకు రాగానే కార్యకర్తలు, అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆయన ప్రసంగం మధ్య మధ్యలో హర్షధ్వానాలు చేశారు. ఆయన ప్రసంగానికి విశేషమైన ప్రతిస్పందన కనబరిచారు.

మహిళలతో ప్రసంగాన్ని ప్రారంభించి...

మహిళలతో ప్రసంగాన్ని ప్రారంభించి...

తన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ మహిళలతో ప్రారంభించారు. రాజకీయాలంటే.. మహిళా శక్తి అంటూ.. ‘మహిళలతో స్టార్ చేద్దాం.. మన అక్కచెల్లెళ్లతో స్టార్ చేద్దాం' అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో గానీ, దేశ రాజకీయాల్లో గానీ కొత్త రాజకీయ ఆలోచన ధోరణి ఉన్న కొత్త రక్తం కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దోపిడీ చేసి.. చేసి కుళ్లిపోయిందని, అందుకే మనకు ఇన్ని సమస్యలు అని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan made to remove chair from the dias arranged for him at Visakhapatnam workers meeting in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి