అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రైతుకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం, ఒంగోలుతో అనుబంధాన్ని గుర్తు చేసుకొని

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాటల తూటాలు పేల్చారు. శుక్రవారం విజయవాడ, అమరావతిలలో పర్యటించారు.

అదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమానిఅదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమాని

ఈ సందర్భంగా అమరావతిలో 3.42 ఎకరాల్లో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ కోసం భూమిని లీజుకు ఇచ్చిన రైతులను పవన్ కళ్యాణ్ కలిశారు.

పవన్! అల్లు అరవింద్‌పై ఏడవకు: కత్తి మహేష్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలుపవన్! అల్లు అరవింద్‌పై ఏడవకు: కత్తి మహేష్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు

ఆ రైతుకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం

రాజధాని ప్రాంతంలో కోట్ల విలువ జేసే భూములను లీజుకు ఇచ్చిన ఓ రైతుకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ఆ ఫోటోను జనసేన పార్టీ షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది. అందులే 'నేను మీ వాడిని.. మీ కోసం వచ్చినవాడిని.. మీ నుంచి వచ్చిన వాడిని.. సదా మీ సేవలో' అని పేర్కొన్నారు.

 గౌరవించడం పవన్ కళ్యాణ్ లక్షణం

గౌరవించడం పవన్ కళ్యాణ్ లక్షణం

'గౌరవించడం పవన్ లక్షణం జనసేన కార్యాలయానికి స్థలాన్నిచ్చిన వారిని సన్మానించిన పవన్. పెద్దాయనకు సభాముఖంగా పాధాభివందనాలు చేస్తున్న సేనాని పవన్ కళ్యాణ్ గారు. నేను మీ వాడిని.. మీ కోసం వచ్చినవాడిని... మీ నుండి వచ్చినవాడి' అని జనసేన కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

 ఒంగోలుతో ఉన్న అనుబంధం చెప్పిన పవన్

ఒంగోలుతో ఉన్న అనుబంధం చెప్పిన పవన్

కాగా, శనివారం ఒంగోలులోని ఎ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో స్థానిక అంశాలు ఎక్కువగా లేవు. కానీ ఒంగోలుతో తనకున్న అనుబంధాన్ని చెప్పారు.

నా వల్ల కొందరు లబ్ధి పొందారు

నా వల్ల కొందరు లబ్ధి పొందారు

చిన్నతనంలో ఒంగోలులోనే గోపాల్‌నగర్‌లో పెరిగానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక్కడి తర్వాత నెల్లూరులో కొన్నాళ్లు ఉన్నామన్నారు. గత ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరుల తరపున ప్రచారం చేశానని, కొందరు తన వల్ల ఎంతో లబ్ధిపొందారన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan respect to farmers who give land to Jana Sena office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X