టిడిపికి ఝలక్: పవన్ సంచలన నిర్ణయం, జనసేన పోటీ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు! రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, విజయవాడ లోకసభ స్థానంపై టిడిపితో విభేదాల నేపథ్యంలో జనసేన పోటీపై పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, జనసేన పార్టీ కేవలం విజయవాడ లోకసభ సీటుకు పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. విజయవాడ సీటును ఆశించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పవన్ మిత్రుడు పొట్లూరి వర ప్రసాద్ పోటీ చేయనున్నారు.

జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పటికీ పొట్లూరి స్వతంత్ర అభ్యర్థి అవుతారు. పొట్లూరి కోసం పవన్ విజయవాడ లోకసభ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసే అవకాశముంది. పొట్లూరితో పాటు మరో ఏడుగురు అభ్యర్థులు స్వతంత్రంగా అసెంబ్లీ బరిలోకి దిగనున్నారట. వారందరి కోసం పవన్ ప్రచారం చేయనున్నారు.
టిడిపి, బిజెపి అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. అయితే, తాను మద్దతిచ్చిన పొట్లూరి వంటి వారి స్థానాల్లో మాత్రం పవన్ బిజెపి, టిడిపిల తరఫున ప్రచారం చేయరు. తమ అభ్యర్థులకే మద్దతుగా నిలబడనున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం పొట్లూరి వర ప్రసాద్ పవర్ స్టార్‌తో భేటీ అయ్యారు. తాను సహా ఏడుగురు నామినేషన్ వేస్తే తమ తరఫున ప్రచారం కోసం చర్చించేందుకు పవన్‌తో పొట్లూరి భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications