వైసీపీ తిట్లను ఆహ్వానిస్తున్నా-అవి సినిమాల్లో కూడా చేయను-పవన్ వ్యాఖ్యలు..
నిన్న కాకినాడ జిల్లా కత్తిపూడి సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఇవాళ అధికార పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పవన్ విమర్శలపై మాజీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. రెండు చెప్పులు చూపించి మరీ పవన్ కు పేర్ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలపై పవన్ జనసేన నేతల సమావేశంలో స్పందించారు.
తనపై వైసీపీ నాయకుల తిట్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇవాళ జనసేన వీర మహిళలతో సమావేశంలో పాల్గొన్న పవన్ కు వైసీపీ నేతల తిట్లను నేతలు గుర్తుచేశారు. దీంతో వైసీపీ నేతల తిట్లపై స్పందిస్తూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తిడుతున్నారని, కానీ తామేంటో చేతల్లో చూపిద్దామని పవన్ జనసేన నేతలతో వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై మీసాలు మెలేయడాలు, తొడగొట్టడాలపై స్పందించాలని జనసేన నేతలు ఆయన్ను కోరారు. దీనిపై స్పందించిన పవన్.. ఇలాంటివి తాను సినిమాల్లోనూ చేయబోనన్నారు. ఇలాంటివి సినిమాల్లో చేయడానికి కూడా తాను ఇబ్బందిపడతానన్నారు. తాము సీరియస్ రాజకీయాలు చేస్తున్నామని గుర్తుచేశారు. వెటకారాలు చేయడం లేదని, మాటలు విసరడం లేదని, మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు పవన్ తెలిపారు.
వైసీపీ నేతల విమర్శలకు బదులివ్వడం, ఎదురుచెప్పడం వంటివి తాను చేయనని, ఒకేసారి చేతల్లో చూపిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పుడు మీరు తొడలు కొట్టారా, మీసాలు మెలేసారా, ఇంకేమైనా అన్నరా అనేవి చెప్పాలన్నారు. ఆ రోజు వస్తుందన్నారు. ఏడాది క్రితం తాము అన్న మాటలకు చింతిస్తున్నామని వైసీపీ నేతలతోనే అప్పుడు చెప్పిస్తానని పవన్ తెలిపారు. అందుకోసం వేచి చూడాలని పవన్ అందరినీ కోరారు.












Click it and Unblock the Notifications