పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి
అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అయితే మార్క్ శంకర్ ఇంకా కోలుకోవాలి. మా కుల దైవమైన ఆంజనేయ స్వామి దయతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఎప్పటిలాగే ఉంటాడు. ఆంజనేయ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి మా బిడ్డను కాపాడాడు.
మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. నా తరఫున, పవన్ కల్యాణ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురై గాయపడ్డాడు. ఈ ఘటనపై పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇదే ఘటనపై అటు సెలబ్రిటీలు, ఇటు రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ పై సానుభూతి వ్యక్తం చేశారు. కుమారుడు గాయపడిన విషయం తెలియగానే పవన్ తో పాటు మెగాస్టార్ కుటుంబం కూడా సింగపూర్ బయల్దేరింది.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2025
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా… pic.twitter.com/nEcWQEj92v
అయితే ఘటన జరిగినప్పుడు.. పవన్ మన్యం పర్యటనలో ఉన్నారు. విషయం తెలియగానే ఆ పర్యటనను ముగించుకుని, అక్కడ చేయాల్సిన పనుల్ని పూర్తి చేసి ఆ తరువాత సింగపూర్‌కు బయల్దేరిన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ కోలుకోవాలని, పవన్ ధైర్యంగా ఉండాలి పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, బండి సంజయ్, వైఎస్ జగన్ వంటి వారంతా కూడా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications