వాళ్లు బాగా 'ఉన్నోళ్లు': పవన్ కల్యాణ్
అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి పాలనలో పేద ప్రజలున్న రాష్ట్రం ఏపీ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుసగా సెటైర్లు వేశారు. ఆక్సిమోరాన్ అంటే విరుద్ధమైన పదాల కలయిక. దీన్ని గురించి ఉదాహరణతో వివరించాలంటే.. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి పాలనలో పేద ప్రజలు ఉన్న రాష్ట్రం ఏపీ. మన ముఖ్యమంత్రి సంపద దేశంలోని ఇతర ముఖ్యమంత్రులదరికంటే ఎక్కువ. మన ఏపీ సీఎం క్లాస్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తీసుకురాగలిగనప్పుడు దావోస్ ఎందుకన్నారు. మన ఐటీ, పరిశ్రమల మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్, చాయ్ పాయింట్లు ప్రారంభిస్తున్నారని, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడంపై వేచిచూడాలన్నారు. ఇది కూడా మరో క్లాస్ చట్టమన్నారు. దేశంలోనే ధనవంతుడైన ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలతో అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని, అటువంటి వ్యక్తి కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ చారు మజుందార్ లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదని, వైసీపీ రాజ్యంలో దౌర్జన్యాలతో ప్రజల్ని బానిసలుగా మార్చుకున్నారని జనసేనాని మండిపడ్డారు. పేపర్ నుంచి శాండిల్ వరకు, అడవుల నుంచి కొండల వరకు, లిక్కర్ నుంచి మైన్స్ వరకు, లాండ్ నుంచి శాండ్ వరకు ప్రతి పైసా ధనవంతుడైన ముఖ్యమంత్రి చేతిలో ఉందని, ఇది నిజంగా క్లాసిక్ అన్నారు. ప్రజల జీవితాలు, గౌరవం, కష్టపడటం వంటివి కొంతమందికి అమ్ముడుపోయాయని, మధ్యతరగతి కుటుంబాలు రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ వారిని పన్నులు చెల్లించేవారిగానే ట్రీట్ చేస్తోందని, పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారని.. ఇది వైఎస్సార్‌సీపీ మాస్టర్ క్లాస్' అంటూ పవన్ మరో ట్వీట్ చేశారు.













Click it and Unblock the Notifications