థ్యాంక్స్: శ్రీజకు డాక్టర్ పునర్జన్మ, పవన్ కళ్యాణ్ కూడా కాపాడారు!

హైదరాబాద్/ఖమ్మం: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా సహాయం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీజ కోలుకోవడంలో పవన్ సహకారం మరువలేమని ఆమె తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. తాను కోలుకోవడానికి సహకరించిన పవన్‌కు శ్రీజ కృతజ్ఞతలు తెలిపారు. తనకు పవన్ అంటే ఇష్టమని ఆమె చెప్పారు.

హైదరాబాదుకు వెళ్లినప్పుడు శ్రీజ ప్రాణాల పైన ఆశ వదులుకున్నామని, మిత్రుల సలహా మేరకు ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించామని, డాక్టర్ అసాధారణ్ తమ బిడ్డకు పునర్జన్మనిచ్చారని తల్లిదండ్రులు చెప్పారు. ఆసుపత్రిలో చేర్పించిన రెండో రోజు నుండే ఆమె ఆరోగ్యంలో మార్పు కనిపించిందని చెప్పారు. పవన్ కల్యాణ్ రావడంతో శ్రీజ త్వరగా కోలుకుందని, త్వరలో శ్రీజను ఆయన వద్దకు తీసుకు వెళ్లి కృతజ్ఞతలు చెబుతామన్నారు.

Pawan Kalyan saves Srija's life?

కాగా, బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ అభిమాని చిన్నారి శ్రీజ పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే. దీంతో ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీజను గురువారం డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబ సభ్యలు ఆమెను పాల్వంచ తీసుకెళ్లారు.

చిన్నారి శ్రీజ చివరి కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న సినీ హీరో పవన్ కళ్యాణ్ అక్టోబర్ 17న ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆమె కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆసుపత్రిలో స్వీట్లు పంచిపెట్టారు.

పాల్వంచకు చెందిన శ్రీజ డీఏవీ మోడల్ స్కూలులో ఏడో తరగతి చదవుతోంది. సెప్టెంబర్ 10న జ్వరంతో అనారోగ్యం పాలైంది. దీంతోపాటు మూర్చ రావడంతో హైదరాబాదు ఆసుపత్రికి తీసుకు వచ్చారు. 15 రోజులు చికిత్స అందించారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్టోబర్ 2న ఖమ్మంలోని కార్తీక ఆశుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ అసాధరణ్ ఆమెకు వైద్యం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చిన్నారి కోరిక మేరకు పవన్ కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+