వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోదీతో పవన్ ఏం చెప్పారు - పీఎం ఇచ్చిన హామీ ఏంటి..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీతో జనసేన అధినేత దాదాపు 30 నిమిషాలు భేటీ జరిగింది. ఆ సమయంలో పవన్ ఏం చెప్పారు.. ప్రధాని స్పందన ఏంటనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి పెంచుతోంది. అయితే, ఈ సమావేశంలో పూర్తిగా ఏపీలోని పరిస్థితుల పైన వివరించేందుకే పవన్ కల్యాణ్ ఈ సమావేశం వినియోగించుకొనేందుకు ప్రయత్నించారని సమాచారం. ముందుగా ఇద్దరి మధ్య కుశల ప్రశ్నల తరువాత.. ప్రధాని మోదీ పని తీరు ను పవన్ ప్రశంసించారు. ఏపీలో ప్రభుత్వ తీరు పైన చెప్పేందుకు పవన్ ప్రధానంగా ప్రయత్నం చేసారు.

అన్నీ తనకు తెలుసన్న ప్రధాని
ఇందుకు సంబంధించి ఒక వినతి పత్రం కూడా ప్రధానికి అందించారని సమాచారం. ఏపీలో తాజా పరిణామాలను వివరించటంతో పాటుగా..ఆర్దిక క్రమశిక్షణ గాడి తప్పిందంటూ ప్రధానికి పవన్ వివరిస్తుండగా.. ఏపీలోని విషయాలన్నీ తనకు తెలుసని ప్రధాని స్పష్టం చేసారు. అదే సమయంలో రాజకీయంగా పవన్ నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ప్రధాని ప్రయత్నించారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పూర్తిగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ తీరు పైన చెప్పేందుకు..అదే సమయంలో దేశంతో పాటుగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం సహకరించేందుకు తాను సిద్దమేనని పవన్ చెప్పినట్లుగా సమాచారం.

Pawan Kalyan says Good days ahead for Andhra after meeting with PM Modi at vizag

తరచూ కలుద్దామని ప్రతిపాదన
ప్రతిపక్ష పార్టీల పైన ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును ప్రధానికి పవన్ వివరించే సమయంలోనూ.. ప్రధాని తనకు అన్నీ తెలుసంటూనే మరింతగా రాజకీయ సమాచారం పైన ఆరా తీసారు. వైసీపీ హయాంలో ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయని.. కొందరిని లక్ష్యంగా చేసుకొని ఇళ్లు కూడా కూల్చుతున్నారంటూ ప్రధానికి పవన్ వివరించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం విన్న ప్రధాని ఇది చాలా కాలం తరువాత మనం కలుసుకోవటంతో జరుగుతున్న ప్రాధమిక సమావేశంగా చెప్పినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో తరచూ కలుస్తూ ఉందామనంటూ పవన్ కల్యాణ్ కు ప్రధాని స్పష్టం చేసారు.

భవిష్యత్ కు మేలు చేసే భేటీ
దీనికి జనసేనాని అంగీకారం తెలిపారు. తనకు రెండు రోజుల క్రితం ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని.. విశాఖ వచ్చి పవన్ ను కలవాలని సూచించారని చెప్పుకొచ్చారు. తాను ప్రధాని తో కలవటం వెనుక ముఖ్య ఉద్దేశం ఉందని వెల్లడించారు. ఏపీ బాగండాలి.. ఏపీ ప్రజల భవిష్యత్ బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారని పవన్ వివరించారు. ప్రధాని పలు విషయాలను అడిగారని..తనకు అవగాహన ఉన్న మేర చెప్పానని పవన్ చెప్పుకొచ్చారు. ఈ సమావేశం ఏపీ భవిష్యత్ కు మంచి చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు పవన్ వివరించారు.

English summary
Janasean Chief Pawan Kalayn meets PM Modi and discussed issues related to AP Govt and Political situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X