వారిని వదులుకోను, ఇక సహించేది లేదు - పవన్..!!
పదవులు తనకు అలంకరణ కాదని.. బాధ్యత అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధే కూటమి లక్ష్యమన్నారు. బాధ్యతల నుంచి తాము పారిపోబోమని.. నిరంతరం పని చేస్తామని పవన్ తెలిపారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని.. గుండెల నిండా నిబద్ధత ఉందన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు సరికొత్త చట్టం తెస్తామన్నారు. ఐదేళ్లలో 20 గ్రామసభలు జరిగేలా చూస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గ్రామ సభలు
ఏపీ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయితీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించున్నారు. మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని తాను వదలుకోనని, మనుషులను కలుపుకొనే వ్యక్తినని, విడగొట్టేవాణ్ని కాదని తెలిపారు.

చిత్తశుద్దితో
గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్న పవన్, 13 వేల 326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామన్నారు. ఉన్న నిధులను కూడా దారిమళ్లించిన పరిస్థితి గతంలో చూశామని, గ్రామాలకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
సిద్దంగా ఉన్నాం
గత ప్రభుత్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని, అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని పవన్ మండిపడ్డారు. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందన్నారు. ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న పవన్, ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటానని, అండగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తామన్నారు.












Click it and Unblock the Notifications