చిరంజీవిని బలిపెట్టిన స్వార్థపరుల్ని మర్చిపోలేదు, చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్తా: పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu
  వాళ్లను చెప్పుతో కొట్టాలి.. -పవన్ కల్యాణ్

  విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జనసేన పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సోదరుడు చిరంజీవి, ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పీఆర్పీ ఓటమి బాధించిందని చెప్పారు. అందుకు కారణమైన అందరినీ జనసేన ద్వారా దెబ్బతీస్తానని చెప్పారు.

  చదవండి: అన్నయ్యకు చెప్పా, అహంకారం తీసేశా, బీజేపీ హిందూ మతానికి: పవన్ కళ్యాణ్ నోట సంచలనం

  చిరంజీవి ప్రజాసేవ చేసేందుకే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని, కానీ ఆయనను దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. వారందరికీ తాము బుద్ధి చెబుతాన్నారు. తద్వారా ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అభిప్రాయపడ్డారు. పరకాల ప్రభాకర్‌కు ప్రజారాజ్యం పార్టీలో స్వేచ్ఛ లేదా అన్నారు. పార్టీ ఆఫీసులోనే తిట్టావంటే పార్టీకి స్వేచ్ఛ ఉన్నట్లే కదా అన్నారు. పరకాల వంటి వారికి తగిన సమయంలో బుద్ధి చెబుతానన్నారు.

  జగన్! అది మానుకో: పవన్ దిమ్మతిరిగే షాక్, 'సీఎం' నినాదాలతో అసహనం, సంతోషం లేదని..

  స్వార్థంతో పీఆర్పీని దెబ్బతీసిన వారిని మర్చిపోలేదు

  స్వార్థంతో పీఆర్పీని దెబ్బతీసిన వారిని మర్చిపోలేదు

  ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న చిరంజీవి లాంటి మహా వ్యక్తిని కొందరు తప్పుదోవ పట్టించారని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్థంతో ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసిన వారిని ఎవరినీ తాను మరిచిపోలేదని చెప్పారు. చిరంజీవి మహానుభావుడిని కొందరు తమ లబ్ధి కోసం బలి పెట్టారన్నారు.

  చిరంజీవిని దెబ్బతీసిన వారికి చెప్పుతో కొట్టినట్లు

  చిరంజీవిని దెబ్బతీసిన వారికి చెప్పుతో కొట్టినట్లు

  ప్రజల మంచి కోసం పార్టీ పెట్టిన తన సోదరుడు చిరంజీవిని మోసం చేసిన వారికి ప్రతి ఒక్కరికి చెప్పుతో కొట్టినట్లు జనసేన బుద్ధి చెబుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పీఆర్పీని దెబ్బతీసిన ఏ స్వార్థ శక్తిని తాను మరిచిపోలేదన్నారు.

  ఈ రోజుకూ ఇంకా ఉత్తరాది, దక్షిణాది

  ఈ రోజుకూ ఇంకా ఉత్తరాది, దక్షిణాది

  ఈ రోజుకు కూడా మనం ఇంకా ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన అనే దేహానికి కార్యకర్తలు రక్తం లాంటివారు అని చెప్పారు. తన సినిమాలకు జైకొట్టి నా వెంట వచ్చే వాళ్లు నా ఆలోచనా శక్తికి అనుగుణంగా అభిమానులు, కార్యకర్తలు రావాలన్నారు.

  ధైర్యం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా

  ధైర్యం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా

  నాకు నేను ధైర్యం తెచ్చుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ధైర్యం చెప్పే నాయకుడు లేక ముందుకు నడిపించగలిగే నాయకుడు లేక జనం సమస్యలపై ముందుకు రావడం లేదన్నారు. ధైర్యం నింపే నేత లేక జనాలు ముందుకు రావడం లేదన్నారు.

  ప్రత్యేక హోదా తెచ్చేవారు

  ప్రత్యేక హోదా తెచ్చేవారు

  మహిళలు, యువత ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తే వారు ఎంతో రాటుదేలేవారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు ప్రత్యేక హోదా తెచ్చుకునే స్థాయికి రాటుదేలేవారని అభిప్రాయపడ్డారు.

  మహా వృక్షాలు అవుతారనే నమ్మకం ఉంది

  మహా వృక్షాలు అవుతారనే నమ్మకం ఉంది

  తాను 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని, ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రక్తం కావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. చిన్న విత్తనమే మహా వృక్షం అవుతుందన్నారు. కార్యకర్తలు అందరూ మహా వృక్షాలు అవుతారనే నమ్మకం ఉందని చెప్పారు. మనది వసుదైక కుటుంబమని, మన కుటుంబం చాలా పెద్దది అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు రావాలన్నారు.

  తాను సరదాకు పార్టీ పెట్టలేదు

  తాను సరదాకు పార్టీ పెట్టలేదు

  ప్రజా సమస్యలపై పోరాడేందుకే తాను జనసేన పార్టీని పెట్టానని, సరదాకు పెట్టలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొన్నాళ్ల క్రితం సత్యాగ్రహి సినిమా కోసం కథ రాసుకున్నానని చెప్పారు. సినిమాల వల్ల వ్యవస్థలు మారవని చెప్పారు. ఎవరైనా తాము ఆచరించి ఇతరులకు చెబితే అర్థం, విలువ ఉంటుందన్నారు.

  సత్యాగ్రహి కథ రాసుకున్నా

  సత్యాగ్రహి కథ రాసుకున్నా

  కాకూడదని అనుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నా వల్ల సమూల మార్పులు రాకపోవచ్చునని, కానీ ఎంతోకొంత మార్చగలమని అన్నారు. రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  సినిమాలు హిట్టయినా ఆనందం లేదు

  సినిమాలు హిట్టయినా ఆనందం లేదు

  2003లోనే తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, ఆ విషయం తన తల్లి, తండ్రి, అన్నయ్య చిరంజీవికి చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమాలు హిట్టయినా తనకు ఎలాంటి సంతోషం లేదని చెప్పారు. ఆత్మ సంతృప్తి కావాలన్నారు. నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలన్నారు.

  ఈ పార్టీలు సరిపోవు

  ఈ పార్టీలు సరిపోవు

  ఒక దేశానికి ఒక నది సరిపోదని ఓ కవి చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. నెహ్రూ, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్‌లే స్ఫూర్తిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సరిపోవని చెప్పారు. బ్రిటిష్ ఇండియా నుంచి బ్రిటిష్‌ను మహాత్మా గాంధీ తొలగించారన్నారు.

  బీజేపీ హిందూమతానికి, జాతీయ భావాలు గల పార్టీ కావాలి

  బీజేపీ హిందూమతానికి, జాతీయ భావాలు గల పార్టీ కావాలి

  బీజేపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరు అనుకునేదే అయినప్పటికీ పవన్ నోట రావడం గమనార్హం. బీజేపీ కేవలం హిందూమతానికే పరిమితమైందని చెప్పారు. ఒక్కొక్క పార్టీ ఓ కులానికి, మతానికి పరిమితమైందన్నారు. జాతీయ భావాలు ఉన్న పార్టీ రావాలని చెప్పారు.

  అహంకారం తొలగించాను

  అహంకారం తొలగించాను

  నాలో నుంచి నేను అహంకారాన్ని తొలగించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను అనేపదాన్ని ప్రజా సమస్యలపై పోరాడే సమయంలోనే వాడుతానని చెప్పారు. ఒక కొత్త యువరక్తం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. గతంలో అశోక్ గజపతి రాజు లాంటి రాజులు, సంస్థానాలు ఉండేవని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan hot comments on Chiranjeevi and Praja Rajyam. He said that he will take revenge who cheated Chiranjeevi and PRP.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి