వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ పార్టీ: కెవ్వుకేక, లాఠీ దెబ్బలు తిన్నారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఆవిర్భావ సభకు పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. శుక్రవారం జరిగిన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని వినడానికి హైటెక్స్ ప్రాంగణానికి అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ ఉన్నది సమస్యలు పరిష్కరించడానికే కానీ, వాటిని మరింత జటిలం చేయడానికి కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. కష్టాల్లో ఉన్నవారి జీవితాలు మరింత దుర్భరం చేసేందుకు కాదని, చట్టం బలవంతులకు, బలహీనులకు అందరికీ ఒకే విధంగా పని చేయాలని ఆయన అన్నారు. ఆడది అర్ధరాత్రి కూడా ఒంటరిగా నడవగలగాలని గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను ఆ ప్రామిస్ చేయలేను కానీ, పట్టపగలు క్షేమంగా వెళ్లగలిగేలా చేస్తామని అన్నారు.

ఎన్నికలకు తాను రెడీ లేనని, పోటీ చేస్తాం గానీ ఇప్పుడో ఎప్పుడో చెప్పలేనని ఆయన అన్నారు. ఒక పార్టీ నిర్మాణం సాగించబోతున్నామని, ఈ రోజు పార్టీ కార్యాలయం కూడా లేదని అన్నారు.ఉన్నడబ్బులన్నీ అయిపోయాయని, ఏదైనా సినిమా చేస్తే డబ్బులు రావాల్సిందేనని ఆయన అన్నారు.

నైతికంగా, సైద్ధాంతకంగా బలంగా ఉండే వారు మనకు కావాలని ఆయన అన్నారు. తాను వేలకోట్లు సంపాదించుకోవడానికి రాలేదని, పత్రిక, టీవీపెట్టడానికి రాలేదని, అలాగని ప్రజాధనం దోచేస్తే ఊరుకోనని అన్నారు.

తోపులాట

తోపులాట

పవన్ కళ్యాణ్ జన సేన ఆవిర్భావ సభ ప్రాంగణం వద్ద శుక్రవారం సాయంత్రం అభిమానులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

లాఠీ చార్జీ..

లాఠీ చార్జీ..

పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద యెత్తున తరలిరావడంతో హైటెక్స్ ప్రధాన ద్వారం వద్ద తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జీ చేశారు.

పరుగులు తీశారు..

పరుగులు తీశారు..

పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాళ్లకున్న చెప్పులను వదిలేసి పరుగులు తీశారు.

ఉత్కంఠతో ఫ్యాన్స్

ఉత్కంఠతో ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ ప్రసంగం వినడానికి పెద్ద యెత్తున అబిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా హైటెక్స్ వద్ద తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది.

ఇలా పడిపోయాడు..

ఇలా పడిపోయాడు..

పవన్ కళ్యాణ్ ప్రసంగ ప్రాంగణానికి వచ్చిన అభిమానులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఓ అభిమాని ఇలా పడిపోయాడు.

ఉద్రిక్తత ఇలా..

ఉద్రిక్తత ఇలా..

హైటెక్స్ ప్రాంగణం వద్ద పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా తీవ్రమైన ఉత్కంఠ, కాస్తా ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి.

నేనే తాట తీస్తా..

నేనే తాట తీస్తా..

అవినీతికి పాల్పడి నాయకుల తాట తీస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తనను తాను భగత్సింగ్‌గా ప్రకటించుకున్నారు.

ఇదీ పవనిజం..

ఇదీ పవనిజం..

గత కొంత కాలంగా పవనిజం అనే పదం అందరి నోళ్లలో నానుతోంది. పవనిజం అంటే ఏమిటో జన సేన ద్వారా చూపిస్తారని అభిమానులు నమ్ముతున్నట్లే ఉన్నారు.

హర్షధ్వానాలు..

హర్షధ్వానాలు..

పవన్ కళ్యాణ్ ప్రసంగానికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అభిమానులు కేరింతలు కొట్టారు.

కేరింతలు..

కేరింతలు..

పవన్ కళ్యాణ్ ప్రసంగానికి అభిమానులు కేరింతలు కొట్టారు. మధ్య మధ్యలో వ్యాఖ్యలు కూడా చేశారు. జై కొట్టారు.

ప్రశ్నించడానికే..

ప్రశ్నించడానికే..

పవన్ కళ్యాణ్ జన సేన ఆవిర్భావ సభ సందర్భంగా అభిమానులు ఇలా బ్యానర్లు ప్రదర్శిస్తూ పవర్ కోసం కాదు, ప్రశ్నించడానికేనంటూ నినదించారు.

English summary

 Police reorted to lathicharge at Hitex in Madhapur during Pwan Kalyan's Jana Sena party launcing programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X