Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నా! నీ కోసం చచ్చిపోతానంటున్నారు కానీ, కుమారస్వామి సీఎం అవుతాడమనుకున్నామా: పవన్

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2009లో ఓట్లు తొలగించినట్లే, ఇప్పుడు కూడా 21 లక్షల ఓట్ల వరకు తొలగించారని ఆరోపించారు. ఇందులో జనసేనకు చెందిన వారివి, యువతవే 19 లక్షలకు పైగా ఉన్నాయన్నారు. నేను మీలో ఒకడిని అని, మీ తమ్ముడినని, మీలో ఒకడిగా చూసుకోవాలన్నారు.

కొందరు అన్నా మీకోసం చచ్చిపోతానని అంటున్నారని, అలా మాట్లాడటం సరికాదని, నా కోసం ఎవరూ చనిపోనక్కరలేదని, ఈ సేవా సెంటర్‌కు వెళ్లి ఓటరు రిజిస్టర్ చేయించుకుంటే చాలన్నారు. మనకు ఓటు చాలా ముఖ్యమన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి (నేటి నుంచి) అక్టోబర్ 30వ తేదీ వరకు ఓటరుగా రిజిస్టర్ చేయించుకోండని యువతకు పిలుపునిచ్చారు. మీ అరుపులు, కేకలు నాకు వద్దని, ఓటరుగా రిజిస్టర్ చేయించుకోండన్నారు. ఎన్నికల్లో జనసేనకు ఓటు వేస్తే అప్పుడు మార్పు వస్తుందన్నారు.

జగన్‌లా సీఎం కావాలని లేదు

జగన్‌లా సీఎం కావాలని లేదు

ప్రతిపక్ష నాయకుడు జగన్‌లా ముఖ్యమంత్రి కావాలని తనకు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు రక్షణ కావాలన్నారు. జంగారెడ్డిగూడెంలో కనీసం మంచి ఆసుపత్రి, పాలిటెక్నిక్ కాలేజీ లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడి రోడ్లు చూసి తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబ్బాయి, మంత్రి లోకేష్ రోడ్లు వేశామని చెబుతుంటారని, కానీ ఇక్కడకు వచ్చి రోడ్లు చూస్తే తెలుస్తుందన్నారు. నిన్న వేకువజామున లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్లానని, కానీ 14 కిలోమీటర్ల దూరానికి 40 నిమిషాలు పట్టిందని చెప్పారు. జేబులో నుంచి డబ్బు తీసి రోడ్లు వేసినట్లు లోకేష్ చెబుతారని, కానీ ఇక్కడ రోడ్లేవి అన్నారు. సవ్యమైన పాలన అందించాలని చంద్రబాబుకు చెప్పానని అన్నారు. ప్రస్తుతం వాడుకొని వదిలేసే రాజకీయ వ్యవస్థ ఉందన్నారు.

Recommended Video

    పవన్! మాట్లాడితే తట్టుకోలేవు..చింతమనేని వార్నింగ్ !
    టీడీపీకి అండగా ఉంటే మోసం చేశారు

    టీడీపీకి అండగా ఉంటే మోసం చేశారు

    తాను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా వేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. మీకు నేను అండగా ఉంటానని చెప్పారు. అమరావతిలో బాండ్స్ ఇస్తున్నారని, మరి పోలవరం నిర్వాసితులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు బాండ్స్ వంటివి మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. చంద్రబాబుకు అనుభవముందనే తాను నాడు మద్దతిచ్చానని, పదేళ్లు సీఎంగా ఉన్నారని, పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నానని చెప్పారని, కొందరు వచ్చి టీడీపీకి మద్దతివ్వాలని చెప్పారని చెప్పారు. ఇక్కడ మాగంటి బాబుకు మద్దతు ఇవ్వడం వల్ల మూడున్నర లక్షల ఓట్లు మన వల్ల వచ్చాయని, లేదంటే ఆయన ఎంపీగా గెలిచి ఉండేవారు కాదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉంటే, మోసం చేశారన్నారు.

     2019 నుంచి 2021 మధ్య దేశ రాజకీయాల్లో మార్పులు

    2019 నుంచి 2021 మధ్య దేశ రాజకీయాల్లో మార్పులు

    2019లో అధికారంలోకి వస్తామని టీడీపీ భావిస్తే అది పొరపాటు అవుతుందని పవన్ అన్నారు. 2019 నుంచి 2021 మధ్య దేశంలో భారీ మార్పులు, కొత్త రాజకీయ సమీకరణాలు వస్తాయని చెప్పారు. కొందరు జనసేనకు ఐదు శాతం, ఏడు శాతమని చెబుతున్నారని, కానీ దేశాలను ఏలిన మందికి మొదట అంతే వచ్చిందన్నారు. కుమారస్వామి కర్ణాటకలను ఏలుతారని ఎవరూ ఊహించలేదన్నారు. ముప్పై, నలభై సీట్లు వచ్చిన ఆయన సీఎం అయ్యారన్నారు. వీధి రౌడీలు, గాలి రౌడీలు ఉంటారని తాను టీడీపీకి మద్దతివ్వలేదన్నారు. పోలవరం నిర్మాణానికి తాము అడ్డు కాదని, అందరికీ న్యాయం జరగాలన్నారు.

    దెందులూరు ఆకురౌడీకి ఇక్కడేం పని? పీతల సుజాతకు విజ్ఞప్తి

    దెందులూరు ఆకురౌడీకి ఇక్కడేం పని? పీతల సుజాతకు విజ్ఞప్తి

    దెందులూరు ఎమ్మెల్యేకు బుట్టాయిగూడెంలో ఏం పని అని పవన్ ప్రశ్నించారు. ఓ ఆకురౌడీకి ఇక్కడ ఏం పని అన్నారు. ఎమ్మెల్యే పీతల సుజాతకు కూడా చెబుతున్నానని, అమ్మా... ఇక్కడ మీరు గెలవడానికి జనసేన కూడా 2014లో తోడ్పడిందని గుర్తుంచుకోవాలని అన్నారు. అలాంటి మీరు కూడా జనసైనికులపై కేసులు పెడితే ఎలాగమ్మా అన్నారు. నాకు ఆడపడుచులు అంటే గౌరవమని, అందుకే పీతల సుజాతకు నేను చెబుతున్నానని, టీడీపీ నేతల వలలో ఆమె పడవద్దన్నారు. జనసైనికులపై కేసులు పెట్టవద్దని, ఫ్లెక్సీలు పెట్టవద్దని అంటే సరికాదన్నారు. సేంద్రియ వ్యవసాయం అంటే చంద్రబాబు తెలుసుకోవాలని, గిరిజనులు రైతులు ఎలా వ్యవసాయం చేస్తారో తెలుసుకోవాలంటే ఓ శాస్త్రవేత్త రాసిన పుస్తకం చదవాలని హితవు పలికారు. చంద్రబాబు ఇప్పటికి చేసిన అప్పులు చాలని, అప్పులు చేసి జనాలపై రుద్దవద్దన్నారు. అమరావతికి బాండ్లు ఇచ్చినట్లు, పోలవరంకు ఇవ్వాలన్నారు. అమరావతికి ఓ న్యాయం, పోలవరంకు మరో న్యాయమా అన్నారు. బుట్టాయిగూడెంలో 400 ఎకరాలు ఆక్రమించుకున్నారని, ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం కబ్జాకోరుల ప్రభుత్వంగా మారిందన్నారు.

    రోజూ బాధపడుతున్నా

    రోజూ బాధపడుతున్నా

    మన ఎంపీలు పార్లమెంటులో రైల్వే లైన్ కోసం ఒక్క ప్రశ్న అడగడం లేదని పవన్ అన్నారు. టీడీపీకి 2014లో ఎందుకు మద్దతిచ్చానా అని రోజు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటే కష్టాలు, డబ్బులతో కూడుకున్నవని తెలిసే వచ్చానని చెప్పారు. ఇక్కడి సౌభాగ్య థియేటర్‌కు తాను దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చానని, కొద్ది రోజులు ఉండి బుట్టాయిగూడెం అడవులు చూశానని, తన అన్నయ్య చిరంజీవి తాను మరోలా అనుకున్నారని చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబును అడిగి మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాడినని, కానీ నేను ఒంటరిగా నేనే గెలిచేందుకు రాలేదని, మిమ్మల్ని (ప్రజలను) గెలిపించేందుకు వచ్చానని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+