ప్రజారాజ్యం తప్పులు పరిశీలించా: వారి వీడియోలు చూసిన పవన్ కళ్యాణ్
తమ పార్టీ నిర్వహిస్తోన్న శిబిరాల గురించి, అందులో పాల్గొంటున్న యువత గురించి జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురువారం అడిగి తెలుసుకున్నారు.
అమరావతి: తమ పార్టీ నిర్వహిస్తోన్న శిబిరాల గురించి, అందులో పాల్గొంటున్న యువత గురించి జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురువారం అడిగి తెలుసుకున్నారు.
శిబిరాల్లో కొనసాగుతోన్న ఎంపికల ప్రక్రియ విధానం, పాల్గొన్న యువత ఇచ్చిన ప్రసంగాల వీడియోలను హైదరాబాదులోని జనసేన ఆఫీస్‌లో చూశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పాలకులు చేస్తోన్న తప్పులకు ప్రజలు ఇబ్బంది పడుతుండడం చూసి తాను చలించిపోయానని చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో జరిగిన తప్పొప్పులను పరిశీలించానని పవన్ తెలిపారు. అందులో జరిగిన తప్పులను మళ్లీ పునరావృతం కాకుండా చూస్తున్నానని అన్నారు.
జులై నాటికి జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అందుకే ఇలా ఎంపికలు చేస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications