జగన్ లా టిక్కెట్లు అమ్ముకోను : ఆయన మామ నన్ను బెదిరించారు: ఆలీ..ఇదే నా స్నేహం: పవన్ ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ వైసిపి అధినేత జగన్ పై విరుచుకు పడ్డారు. జగన్ లాగా తాను టిక్కెట్లు అమ్ముకోలేదని వ్యాఖ్యానించారు. ఆయన మామ రవీంద్రనాద్ రెడ్డి సినిమా తీయాలని తనను బెదిరించారని చెప్పుకొచ్చారు. ఇక, ఆలీ పైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్నేహం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
తండ్రి శవం పక్కన పెట్టుకొని జగన్...
వైసిపి అధినేత జగన్ పై పవన్ సంచలన ఆరోపణలు చేసారు. పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు అభ్యర్దుల నుండి జగన్ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం కావాలనుకున్న.. జగన్ రాష్ట్రానికి అవసర మా అని ప్రశ్నించారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదన్నారు. వైఎస్ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని బెదిరించారని, జగన్ ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తారా అని నిలదీసారు. నాకు సినిమా చేయాలనిపిస్తే వారి తో చర్చలు కుదిరితే అప్పుడు నిర్ణయం ఉంటుందన్నారు. అలా కాకుండా ఏదో వెనుక ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది కదా అని బెదిరించాలని చూస్తే తోలు తీస్తానని పవన్ హెచ్చరించారు. జగన్ తన ఇంట్లోనో..లోటస్ పాండ్‌లోకో వచ్చి సగం వాటా ఇవ్వమంటే ఇస్తారా అని పవన్ ప్రశ్నించారు. తాను ఎవరినీ నమ్మటం లేదని కేవలం అభిమానులను మాత్రమే నమ్ముకున్నానని చెప్పుకొచ్చారు.

ఆలీ..ఇదేనా స్నేహమంటే..
సినీ నటుడు ఈ మధ్య కాలంలోనే వైసిపి లో చేరిన ఆలీ పై పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కష్టాల్లో ఉన్న ఆలీకి అండగా ఉన్నానని..అయితే, ఇప్పుడు ఆలీ తనను కాదని జగన్ తో చేరాడని..ఇదేనా స్నేహమంటే అని ప్రశ్నించారు. జగన్ ను ఆలీ బలమైన నాయకుడిగా భావించారని..అందుకే వైసిపిల లో చేరారని చెప్పుకొచ్చారు. అలీ జనసేన లో మాత్రమే చేరాలనే నిబంధన ఉండదన్నారు. ఆయనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆలీ బావ మరిదికి తాను నర్సరావుపేట ఎంపీ సీటు ఇస్తే..ఆలీ మాత్రం తనను కాదని వెళ్లిపోయారని వివరించారు. తాను స్టార్ పవర్ ను నమ్ముకోలేదని స్పష్టం చేసారు. అదే విధంగా ఆలీ వైసిపి లో చేరినంత మాత్రాన తనకేం నష్టం జరగదని పవన్ వివరించారు.












Click it and Unblock the Notifications