ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ సంచలనం : సీఎం ను ఇక ఇలా - రఘురామ సూచనలు పాటిస్తా : నన్ను ఎవరూ భరించలేరు..!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏలూరు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శ సమయంలో పవన్ చింతపులపూడి సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఒంగోలు సభలో పవన్ ను పరోక్షంగా దత్తపుత్రుడు అంటూ మరో సారి వ్యాఖ్యానించారు. దీని పైన స్పందించిన పవన్ ఎవరెన్నిసార్లు అలా అన్నా తాను మాత్రం మర్యాదగా మాట్లాడానన్నారు. ఇదే విధంగా తనను దత్తపుత్రుడు అని అంటే ఊరుకునేది లేదని..సీఎం జగన్​ను సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుందని పేర్కొన్నారు.

రఘురామ రాజు సూచనలతో...

రఘురామ రాజు సూచనలతో...


రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని పవన్ నిలదీసారు. రైతు సమస్యలు పరిష్కరించలేని గ్రామసచివాలయాలు ఎందుకని ప్రశ్నించారు. సీబీఐ దత్తపుత్రుడి మాటలను తాను పట్టించుకోనని చెబుతూ.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు చెప్పిన సూచనలు పాటిస్తానంటూ పవన్ స్పష్టం చేసారు. కష్టాల్లో ఉన్నవారంతా తన సొంతవాళ్లేనని చెప్పారు. తను ఎవరికీ దత్తతకు వెళ్లనని చెప్పుకొచ్చారు. తాను రైతు పరామర్శ యాత్రలో భాగంగా అనంతపురంలో జరిగిన సభ తరువాత నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కొన్ని సూచనలు చేసారని వెల్లడించారు. కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ ఆయన చెప్పారని..సరిదిద్దుకోవాలని సూచించారని పవన్ వివరించారు. ఆయన చేసిన సూచన మేరకు సరిదిద్దుకుంటానని స్పష్టం చేసారు.

తనను ఎవరూ భరించలేరంటూ..

తనను ఎవరూ భరించలేరంటూ..


పోయినసారి చర్లపల్లి షటిల్‌ టీం అని తాను అన్నానని..అది చర్లపల్లి కాదు..చంచల్‌గూడ షటిల్‌ టీం అని ఆయన సరి చేసారంటూ పవన్ చెప్పుకొచ్చారు. తానెవరికీ దత్తత వెళ్లనని... తనను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరని పవన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన సభలకు హాజరైన యువత వైసీపీకి ఓట్లు వేసారని చెప్పారు. యువత బాధ్యత తీసుకోకుంటే సమాజంలో మార్పు రాదన్నారు. ఎన్నికల్లో రెండుచోట్లా ఓడిపోయినా ప్రజల కోసం నిలబడ్డానని చెప్పుకొచ్చారు. ఇక, ఏలూరు సభకు వచ్చే సమయంలో పవన్ కాన్వాయ్ కు స్వాగతం పలికే వేళ... కొందరు జై జగన్ అంటూ నినాదాలు చేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్


పచ్చని గోదావరి జిల్లాల్లోనూ రైతు ఆత్మహత్యలు దారుణమని పవన్‌ వాపోయారు. జనసేన కార్యకర్తలపై గూండాలతో దాడులు చేయిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. తమ వారిపై దాడులు చేసే వైసీపీ నేతలకు మర్యాద దక్కదని పవన్ హెచ్చరించారు. అయితే, ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తాను ఏ రకంగా మాట్లాడాలో చేసిన సూచనలను పాటిస్తానని..తన వ్యాఖ్యలను సరిదిద్దుకుంటానంటూ పవన్ ఓపెన్ గా చెప్పటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక, పవన్ - రఘురామ గురించి వైసీపీ నేతలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Pawan Kalyan sensational comments as he says he will take Raghu rama suggestions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X