మీ సమస్యలు పవన్ కళ్యాణ్ కు చెప్పుకోవాలా? ఇలా చెయ్యండి!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరివాడు. పవన్ కళ్యాణ్ జనసేన మంత్రులకు ఎమ్మెల్యేలకు జనసేన పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని ప్రజల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడానికి పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
పార్టీ ఆఫీసులో ప్రజల అర్జీలు తీసుకోనున్న జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను తీసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరి సమస్యలను ఒక్కడిగా పరిష్కరించటం పవన్ కళ్యాణ్ కు సాధ్యపడటం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ తనతో సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో అర్జీలను స్వీకరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

జనసేన ప్రజాప్రతినిధులకు షెడ్యూల్
జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇకపై జనసేన పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఏ రోజు ఎవరెవరు అందుబాటులో ఉంటారో షెడ్యూల్ చూసినట్లయితే ఆగస్టు 1,2 తేదీలలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. ఆగస్టు 3, 4 తేదీలలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు.
ఈ తేదీలలో అందుబాటులో ఉండేది వీరే
5, 6 తేదీలలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, 7, 8 తేదీలలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, 9, 10 తేదీలలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అందుబాటులో ఉంటారు.11, 12 తేదీలలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, 13, 14 తేదీలలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, 16, 17 తేదీలలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందుబాటులో ఉంటారు.
ఎమ్మెల్యేలు, మంత్రులకు డ్యూటీ
18, 19 తేదీలలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, 20, 21 తేదీలలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, 22వ తేదీ మంత్రి కందుల దుర్గేష్, 23, 24వ తేదీలలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, 25, 26 తేదీలలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, 27, 28 తేదీలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు, 29, 30 తేదీలలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందుబాటులో ఉంటారు.
ప్రజల నుండి సెప్టెంబర్ 11 వరకు షెడ్యూల్
ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2, 3 తేదీలలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ నాలుగు ఐదు తేదీలలో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు 6, 7 తేదీలలో రైల్వేకోడూరి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 8, 9 తేదీలలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ 10, 11 తేదీలలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.












Click it and Unblock the Notifications