పాక్ సైన్యాన్ని ఎలుకలతో పోల్చి.. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్!

ఉగ్రవాదులకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు భారతదేశం గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులకు తెగబడగా, పాక్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టింది.

పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం
ఇక తాజాగా కాల్పుల విరమణకు కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ తో చర్చలలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకుంది. అయినప్పటికీ పాక్ చర్యలను ఒక కంట కనిపెడుతూనే ఉంది భారత్. ఇక భారతదేశం పాకిస్తాన్ పైన పూర్తిగా ఉక్కుపాదం మోపాలని చాలామంది భారతీయులు భావించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు.

Pawan Kalyan sensational tweet comparing the Pakistani army to rats

ఆసక్తికర ట్వీట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సోషల్ మీడియా వేదికగా శత్రుదేశంతో కాల్పుల విరమణ ఒప్పందం మంచిది కాదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి భారత్ లోకి తీసుకునే వరకు, పాక్ పైన దాడి చేసి బుద్ధి చెప్పాల్సింది అని పలువురు తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ ను చేశారు.

పాకిస్తాన్ ను ఎలుకతో పోల్చిన పవన్ కళ్యాణ్
పాకిస్తాన్ సైన్యాన్ని ఎలుకలతో పోల్చారు. భారతదేశాన్ని శేషనాగు తో పోల్చారు. పాక్ వక్ర బుద్ధిని తిరువళ్ళువార్ తిరుక్కురల్ లోని ఒక పద్యంతో విమర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ ను ఎలుకతో పోల్చి తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. తమిళ కవి అయిన తిరువళ్ళువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని పద్యాన్ని పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

మోదీ సారధ్యంలో భారత రక్షణ దళాలకు కీర్తి
"ఎలుకలన్ని జేరి సముద్రము వలె ఘోషించినప్పటికి ఏమి హాని జరుగుతుంది? శేష నాగు ఒక్క హుంకారం చేయగానే అవన్నీ నశిస్తాయి" అంటూ పోస్ట్ చేశారు. ఆయన తన ట్వీట్ లో s400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన ఒక ఫోటోను కూడా ట్వీట్ చేశారు . అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో మన భారత రక్షణ దళాలకు కీర్తి లభించిందని పవన్ కళ్యాణ్ తన పోస్టు ద్వారా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+