ఏపీలోనూ "హైడ్రా".. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ !!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "హైడ్రా" పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లేటెస్ట్ గా ఈ హైడ్రా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వివాహ వేడుక‌లో పాల్గొనేందుకు విజ‌య‌వాడకు వెళ్లిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్.. డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పవన్ అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హైడ్రా లాంటి వ్యవస్థలు పాలనలో పారదర్శకతను తీసుకురావడమే కాకుండా ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తాయన్నారు. ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, ఫేక్ రికార్డులు వంటి సమస్యలను పూర్తిగా నివారించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇది కేవలం సాంకేతిక వ్యవస్థ మాత్రమే కాదని టెక్నాలజీ ఆధారంగా రూపొందిన సమగ్ర పరిపాలనా మోడల్ అని పవన్ అభిప్రాయపడ్డారు.

pawan-kalyan-shocking-comments-on-hydra-and-commissioner-ranganath

రంగనాథ్ లాంటి నిబద్ధత గల అధికారులే వ్యవస్థలకు జీవం పోస్తారని ప్రశంసించారు. కొత్త వ్యవస్థను సృష్టించడమే కాకుండా.. సరైన అధికారిని ఎంపిక చేసి, పూర్తి స్వేచ్ఛతో పని చేసే అవకాశం ఇవ్వడం నిజంగా అభినందనీయం అన్నారు. అధికారులు స్వతంత్రంగా, భయపడకుండా పని చేసే వాతావరణం ఏర్పడితేనే ప్రజల అంచనాలకు తగిన ఫలితాలు వస్తాయని పవన్ పేర్కొన్నారు. రంగనాథ్ సమర్థత, క్రమశిక్షణ వల్ల ఈ ప్రాజెక్ట్ ప్రజల మన్ననలు పొందుతోందని చెప్పారు.

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైడ్రా తెలంగాణలో సక్సెస్ అయితే దాని మోడల్‌ను ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలన్నారు. భూమి అక్రమాలను అరికట్టడం దేశవ్యాప్త అవసరమని స్పష్టం చేశారు. హైడ్రా ద్వారా ప్రభుత్వ భూముల డిజిటల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రియల్ టైమ్ మానిటరింగ్, డ్రోన్ సర్వేలు వంటి పద్ధతులను అమలు చేస్తున్నారు.

ఇక హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా టీమ్ విజయవంతంగా పని చేస్తోంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తూ హైడ్రా దూసుకుపోతోంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. ఫీల్డ్‌లోకి దిగి తక్షణ చర్యలు చేపడుతోంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ప్రత్యక్షమై, యాక్షన్ మొదలు పెడుతూ ఆక్రమణలకు గురైన భూములకు విముక్తి కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+