మంత్రులు, ఎమ్మెల్యేల కు విజయ్ మార్క్ ట్రీట్మెంట్- సంచలన ఆదేశాలు..!!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు తరువాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్... ఇప్పుడు రూటు మార్చారు. సొంత నేతల తీరు పైన ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఈ మధ్య కాలంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించారు. అందు లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలను వెంటనే చెన్నైకు రావాలని ఆదేశించారు. వారితో కీలక భేటీకి డిసైడ్ అయ్యారు. ఈ సమావేశం ద్వారా సంచలన ఆదేశాలు జారీకి రంగం సిద్దమైంది.
సీఎం విజయ్ సొంత పార్టీ నేతలకు తన మార్క్ ట్రీట్మెంట్ కు సిద్దమయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత వరుస నిర్ణయాలతో తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్న విజయ్.. తాజా పరిణామాల పైన ఆగ్రహంతో ఉన్నారు. సొంత పార్టీ నేతల తీరుతో విమర్శలకు కారణమవుతున్న వారితో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంత్రులు.. పార్టీ ఎమ్మెల్యే లతో రేపు (బుధవారం) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఎమ్మెల్యేలందరూ వెంటనే చెన్నైకి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. టీవీకే ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో చిక్కుకోవడంపై తమిళనాట తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో.. విజయ్ అలర్ట్ అయ్యారు. చెన్నైలోని పనైయూర్లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇటీవలి కాలంలో కొందరు టీవీకే ప్రజాప్రతినిధుల ప్రవర్తన, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న వివాదాలపై చర్చించేందుకు సీఎం విజయ్ ఈ అత్యవసర భేటీని నిర్ణయించారు.

మంత్రులు... ఎమ్మెల్యేలతో కీలక భేటీ
తాజాగా తన నియోజకవర్గంలోని పౌర సమస్యలపై ప్రశ్నించిన కార్తీక్ కుమార్ అనే ఫోటోగ్రాఫర్పై తమిళనాడు డిప్యూటీ స్పీకర్, టీవీకే ఎమ్మెల్యే అయిన రవిశంకర్ దాడి చేశారనే ఆరోపణలు, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంపై పార్టీ నాయత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే విధంగా కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ జిల్లా కలెక్టర్కు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా కొందరు ప్రజాప్రతినిధుల ప్రవర్తన వల్ల ప్రభుత్వం, పార్టీ ప్రజాప్రతిష్ట దెబ్బతింటున్న నేపథ్ యంలో, ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అధికారులతో హుందాగా ప్రవర్తించాల ని ఇప్పటికే సీఎం విజయ్ నిర్దేశించారు. అయినా.. కొందరు తీరు మారకపోవటంతో ఈ సమావేశం ద్వారా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
