చంద్రబాబు రాజీనామా కోసం పవన్ కల్యాణ్ పట్టుపట్టాలి..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండపోయిందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో మహిళలకు ,ముఖ్యంగా యువతలకు మన ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని రోజా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రలు క్షీణించాయని..ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని, ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రాతినిధ్యం వహిస్తోన్న చోటే మహిళలకు రక్షణ లేదని కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు.ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు తమ పిల్లలను స్కూల్‌కి పంపిస్తే వారు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఆందోళన చెందుతున్నారని రోజా చెప్పుకొచ్చారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి @myogiadityanath గారి లాగా పనిచేయాలని పోలీసులకు చెప్పడం కాదు @PawanKalyan గారూ... మీ నాయకుడు @ncbn కు చెప్పండి!!
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 4, 2024
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. పోలీసులు, అధికారులతో పని చేయించుకోలేని చేతకాని పరిస్థితులలో మంత్రులు ఉన్నారా అంటూ ఆమె ప్రశ్నించారు. కింది స్థాయి అధికారులు, పోలీసులు సరిగా పని చేయకపోతే ఆ వైఫల్యం ప్రభుత్వానిదేనని చెప్పారు. హోంమంత్రి అనితపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బాధ్యతగా పని చేసి లా అండ్ ఆర్డర్ చక్కబెట్టాలని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా పని చేయాలని పోలీసులకు సూచనలివ్వడం కాదని, ఆయనలా పని చేయాలని మీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పాలని పవన్ కల్యాణ్‌కు ఆమె ఈ సందర్భంగా చురకలు అంటిచ్చారు. ఏపీలో మహిళలు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న నేరాల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులతో మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం ఏపీలో లా అండ్ అర్డర్ గురించి విమర్శించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications