పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ అల్పాహారం, పరిటాల సునీత స్వయంగా చేయించారు

అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‍ ఆదివారం మంత్రి, టిడిపి నేత పరిటాల సునీత ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. బ్రేక్ ఫాస్టుగా రాగిముద్ద, పల్లీల చట్నీని వడ్డించారు. పవన్‌కు అల్పాహారం నిమిత్తం పరిటాల సునీత దగ్గర ఉండి మరీ వంటకాలు సిద్ధం చేయించారు.

Recommended Video

    పరిటాల ఇంటికి పవన్, గుండు కొట్టించడంపై సునీత

    రాగి ముద్దతో పాటు ఇడ్లీ, వడ, దిబ్బరొట్టె, పొంగల్, రాగి సంకటిని చేయించారు. వీటితో చట్నీ, సాంబర్, కారంపొడి, నెయ్యి తదితరాలను సిద్ధం చేశారు. పరిటాల కుటుంబం, మరికొందరితో పాటు పవన్ అల్పాహారం తీసుకున్నారు. అల్పాహారం తీసుకునే సమయంలో ఆ తర్వాత పవన్, పరిటాల సునీత పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది.

    Pawan Kalyan Speaks to Media After Meeting with Paritala

    కాగా, ఆ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అధికార పక్షంలో ఉన్న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

    ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే పరిస్థితులు ఉండకపోవచ్చునని ఆ విషయం ప్రజలకు చెప్పాలన్నారు. అన్నం ముద్ద సాక్షిగా, రాగి ముద్ద సాక్షిగా అనంతపురంకు, రాయలసీమకు అండగా ఉంటానని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+