వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు ముద్రగడ ఏం చెప్పారంటే! ఇలా చేశారేమిటి.. అనూహ్యంగా వ్యూహం మార్చారా?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక పూర్తిస్తాయి రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఈ విషయం తేలిపోయింది. త్వరలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేయనున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగు నేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభిస్తున్నానని, 2009 ఎన్నికల ప్రచారం సమయంలో ప్రమాదం నుంచి ఇక్కడే క్షేమంగా బయపడ్డానని, దానికి తోడు మా కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి అని అందుకే ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నానని, తన పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తానని, తనను ఆశీర్వదించాలని కోరారు.

రాజకీయ వ్యూహాల అమలు ప్రారంభించారు

రాజకీయ వ్యూహాల అమలు ప్రారంభించారు

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారా? ముద్రగడతో జనసేన కోశాధికారి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ముద్రగడను కలవాలని పవన్ నిర్ణయించుకోవడం దేనికి సంకేతం అనే చర్చ సాగుతోంది. పార్టీని కిందిస్థాయి నుంచి నిర్మించుకునే విషయమై పవన్ ముందుకు వెళ్తున్నారు. జిల్లాల వారీగా శిబిరాలు నిర్వహించి జనసైనికులను ఎంపిక చేసుకున్నారు.
సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించారు. మార్చిలో ప్లీనరీ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్లీనరీ తర్వాత నుంచి లేదా అంతకుముందు నుంచే పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించనున్నారు.

ఇప్పుడిప్పుడు వ్యూహాలకు పదును

ఇప్పుడిప్పుడు వ్యూహాలకు పదును

కొత్త తరహా రాజకీయ సంస్కృతికి జనసేన అర్థం చెబుతుందని పవన్ పలుమార్లు చెప్పారు. దానికి తగిన్లుగా కొన్ని అంశాలపై నిర్ధిష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారినప్పుడు ఆ ఘటనలను ఖండించారు కానీ, రిజర్వేషన్ల ఉద్యమానికి నేరుగా మద్దతు ప్రకటించలేదు. ప్రభుత్వం చేయలేకపోతే ఆ విషయాన్ని సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర అంశాల్లో పవన్, రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోలేదు. పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న పవన్ ఇప్పుడిప్పుడే తన వ్యూహాలకు పదనుపెడుతున్నట్లు ఉందని అంటున్నారు.

ముద్రగడ సూచనలు తీసుకున్నారా?

ముద్రగడ సూచనలు తీసుకున్నారా?

ముద్రగడ పద్మానాభంను ఇటీవల జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య కలిశారు. పవన్ దూతగా వచ్చినట్లుగా చెప్పి అనేక అంశాలపై చర్చలు జరిపారని తెలుస్తోంది. జనసేన నిర్మాణం, రాజకీయ వ్యూహాలు, రిజర్వేషన్లపై సలహాలు, సూచనలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, త్వరలో పవన్ కూడా ముద్రగడను కలుస్తారని తెలుస్తోంది. పవన్ రాజకీయ వ్యూహాల్లో వస్తున్న మార్పుకు ఇదో సాక్ష్యమని అంటున్నారు.

సన్నిహత సంబంధాలు లేవు కానీ

సన్నిహత సంబంధాలు లేవు కానీ

ముద్రగడతో జనసేనకు లేదా పవన్‌కు సన్నిహిత సంబంధాలు లేవు. కాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో ముద్రగడ పలువురిని కలిశారు. ఇతర పార్టీల్లోని సామాజిక వర్గ ప్రముఖులతో తరుచూ సమావేశమయ్యారు. కానీ పవన్‌ను కలవలేదు. అందుకు కారణం కూడా ఉంది. పవన్‌కు కులమతాలు పట్టవు. ఆయన వాటికి అతీతంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నారు. రిజర్వేషన్లకు మద్దతు కూడా ఇవ్వలేదు. అందుకే ముద్రగడ పలుమార్లు పవన్ పట్ల తన అసంతృప్తిని ప్రకటించారు. పవన్ ఎవరో తనకు తెలియదని కూడా చెప్పారు. ఇప్పుడు అదే ముద్రగడతో జనసేన చర్చలు జరపడానికి రాజకీయ వ్యూహమే కారణమని అంటున్నారు.

 పవన్‌కు ముద్రగడ ఏం చెప్పారంటే

పవన్‌కు ముద్రగడ ఏం చెప్పారంటే

పార్టీకి అండగా ఉంటాయనుకున్న సామాజికవర్గాల మద్దతును పూర్తి స్థాయిలో సమీకరించడంతో పాటు సీనియర్ రాజకీయ నేతల సూచనలు, సలహాలతో పార్టీ నిర్మాణం చేపట్టాలన్న వ్యూహాన్ని పవన్ అమలు చేస్తున్నట్లు చేస్తున్నారని అంటున్నారు. రాఘవయ్య రావడంతో ముద్రగడ కూడా జనసేన బలోపేతానికి సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుందని వాటిని నెరవేర్చే దిశగా పవన్ కృషి చేయాలని ముద్రగడ సూచించినట్లు తెలుస్తోంది.

ఇలా ఎందుకు చేశారు, అందుకే పవన్ వ్యూహం మార్చారా

ఇలా ఎందుకు చేశారు, అందుకే పవన్ వ్యూహం మార్చారా

జనసేనకు కుల ముద్ర అంటేనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పవన్ ఇప్పుడు స్వయంగా ముద్రగడతో ఎందుకు చర్చించారనేది ఆసక్తిగా మారింది. కాపు సామాజికవర్గం జనసేనకు బేస్‌గా ఉంటుందనే భావనతోనే పవన్ వ్యూహంలో మార్పు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ముద్రగడను పార్టీలోకి తీసుకుని ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటారని కూడా భావిస్తున్నారు. అయితే ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్నందున కలిశారని, మిగతా వారిని కూడా కలిసే అవకాశాలు ఉండవచ్చునని, అప్పుడే ఎలా అంచనాకు వస్తామని కూడా కొందరు అంటున్నారు.

కొన్ని పక్కన పెట్టక తప్పదా, త్వరలో చేరికలు

కొన్ని పక్కన పెట్టక తప్పదా, త్వరలో చేరికలు

భిన్నమైన రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతానంటున్న పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీగా జనసేన నిలబడాలనుకుంటే ఇప్పటి వరకూ తను చెప్పిన కొద్ది సిద్ధాంతాలను పక్కన పెట్టక తప్పదన్న అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోందని అంటున్నారు. జనసేనకు అండగా ఉండే వర్గాలకు ముందుగా భరోసా కల్పించడం, ఆ తర్వాత సీనియర్ రాజకీయ నేతలను పార్టీలోకి తీసుకుని, వారి సలహాలు, సూచనలతో ముందుకెళ్లడం కూడా పవన్ వ్యూహాల్లో భాగంగానే భావిస్తున్నారు. ఇదే నిజమైతే త్వరలోనే జనసేనలో చేరికల పర్వం మొదలవుతుంది.

English summary
Janasena Chief and power star Pawan Kalyan made a announcement in twitter on Saturday. He said that he will come to the people soon. He urged blessings from Two telugu state people. He told that he is going to start his political tour from Kondagattu Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X